లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖరాసిన ఎంపీ రఘరామ కృష్ణరాజు..!

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖరాసిన ఎంపీ రఘరామ కృష్ణరాజు..!
ఎంపీ రఘరామ కృష్ణరాజు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కు లేఖరాశారు. తనపై అనర్హత వేటు వేసేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఎంపీ రఘరామ కృష్ణరాజు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కు లేఖరాశారు. తనపై అనర్హత వేటు వేసేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తనపై అనర్హత వేటు విషయమై విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోవద్దంటూ కోరారు. తాను ఎక్కడ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించలేదన్న రఘురామ..ప్రభుత్వ వైఫల్యాలను చక్కదిద్దుకోవాలని హితువు చెప్పినట్లు లేఖలో వెల్లడించారు. ఇవి పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకురాదన్న రఘురామ...భిన్నభిప్రాయాలు వ్యక్తం చేసినంతమాత్రానా..పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడినట్లు కాదని వివరించారు. లేఖతోపాటు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జతపర్చారు ఎంపీ రఘురామ.

ఎంపీ రఘరామ కృష్ణరాజు ప్రివిలేజ్‌ మోషన్‌పై స్పీకర్ కార్యాలయం స్పందించింది. రఘురామ ఫిర్యాదును కేంద్రహోంశాఖకు స్పీకర్‌ కార్యాలయం పంపింది. దీనిపై విచారణ చేపట్టి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.. మరోవైపు వైసీపీ ఎంపీ రాఘురామకృష్ణరాజు అనర్హత పటిషన్‌పై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. ఆ విషయంపై రన్నింగ్‌ కామెంటరీ చేయలేమని స్పీకర్ అన్నారు. అనర్హత పిటిషన్‌పై చర్యలకు ఒక ప్రక్రియ అంటూ ఉంటుందని, ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఇరుపక్షాల వాదనలు వింటామన్నారు. సభను స్తంభింపజేస్తామని వైసీపీ ఎంపీలు చెప్పడంపై స్పందించిన స్పీకర్‌.. సభలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story