వారికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడంపై సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ..!

వారికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడంపై సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ..!
కరోనా కేసలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి.. 18 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నారన్న రఘరామ..

Raghu Ramakrishna Raju: ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. అప్పుచ్చువాడు వైద్యుడు అనే సుమతీ శతక పథ్యంతో లేఖను ప్రారంభించిన రఘురామ.. ఎక్కవ వడ్డీ ఇస్తామన్నా ఏపీకి అప్పు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని.. కనీసం రాష్ట్రంలో మంచి డాక్టర్లైనా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అప్పుడే ఏపీలో ప్రజలు నివశించేందుకు ఇష్ట పడటానికి వీలుంటుందని పేర్కొన్నారు. మే, జూన్‌ నెల్లల్లో రాష్ట్రంలో లక్షా 68వేల 183 మరణాలు సంభవించాయన్న రఘురామ.. ప్రభుత్వం నిర్వహించే జననమరణాల రిజిస్టర్‌ను చూస్తే రాష్ట్రంలో సాధారణంగా 30 వేలు నుంచి 35 వేల మంది మరణిస్తారని.. కరోనా లెక్కల ప్రకారం మే 2వేల 938 మంది.. జూన్‌ నెలలో ఒక వేయి 776 మంది కరోనాతో మరణించినట్లు తెలుస్తోందన్నారు.

ఏపీ ప్రభుత్వం ఎంతో అదుపుచేసి మరణాల లెక్కలు ప్రకటించినా కూడా.. దేశ సగటుతో పోలిస్తే మన రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగానే ఉన్నాయని రఘురామ ఆరోపించారు. అదే సమయంలో చాలా మరణాలను కరోనా కింద చూపించడం లేదని ఆరోపించారు. కరోనా మరణాలు కాకపోతే మరి ఈ మరణాలు ఇంత పెద్ద సంఖ్యలో ఎలా సంభవించాయనే విషయాన్ని పరిశోధించి తేల్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సుమారు లక్ష మంది మరణించడానికి కరోనా కాకుండా వేరే కారణం ఏమై ఉంటుందా అనే విషయానికి సమాధానం వెతికిపట్టుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మరణాల సంఖ్య ఇంత దారుణంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్న స్థితిలో.. వైద్య ఆరోగ్య వ్యవస్థ సామర్ధ్యాన్ని, అందులో మౌలిక వసతులను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తుందన్నారు.

కరోనా కేసలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి.. 18 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నారన్న రఘరామ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా కూడా ఇప్పటి వరకూ ఏపీలో 18ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్‌ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లే వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎంతో ఆందోళన వ్యక్తం చేసిందని.. సరైన కాలంలో పరీక్షలు నిర్వహించలేకపోతున్నందుకు ఎంతో బాధపడిందన్న ఆయన.. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్‌ ఎందుకు ఇవ్వలేకపోయిందో అర్ధం కావడం లేదన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధించాలని.. ప్రయివేటు డాక్టర్లు మాత్రమే సభ్యులుగా ఉన్న కమిటీ సిఫార్సు చేయగానే మన రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్‌ను విధించిందన్నారు. మరింత ఆశ్చర్యకరంగా ఆ కమిటీలో ఉండి, హైదరాబాద్ కు చెందిన ఇద్దరు ప్రయివేటు డాక్టర్లను ఏపి మెడికల్ కౌన్సిల్ కు, ఏపి మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు అధిపతులుగా నియమించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రయివేటు ప్రాక్టీసు చేసుకునే ఈ ఇద్దరు డాక్టర్లకు తగినంత అనుభవం లేదని లేఖలో పేర్కొన్నారు. అలాంటి వారిని తీసుకువచ్చి ఇంతటి ప్రధానమైన పోస్టుల్లో నియమించడం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story