Lokesh On DGP : నాదెండ్ల బ్రహ్మంపై ఈగ వాలిన డీజీపీదే బాధ్యత : లోకేష్‌

Lokesh On DGP : నాదెండ్ల బ్రహ్మంపై ఈగ వాలిన డీజీపీదే బాధ్యత : లోకేష్‌

lokesh and dgp

Lokesh On DGP : టీడీపీ కార్యాలయాలపై, నేతలపై దాడుల వ్యవహారాన్ని ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది.. ఇదే విషయంపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను సూటిగా ప్రశ్నించారు.

Lokesh On DGP : టీడీపీ కార్యాలయాలపై, నేతలపై దాడుల వ్యవహారాన్ని ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది.. ఇదే విషయంపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను సూటిగా ప్రశ్నించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. దాడికి పాల్పడ్డ వాళ్లలో ఒక్కడినైనా అరెస్టు చేశారా అంటూ సూటిగానే ప్రశ్నించారు.. పైగా, ఇదేం అరాచకమని శాంతియుతంగా నిరసన తెలిపే టీడీపీ నేతల్ని అరెస్టు చేస్తారా అంటూ నిలదీశారు.

మా నాయకులు పట్టాభి, నాదెండ్ల బ్రహ్మం.. ఇలా అరెస్టు చేసుకుంటూపోతే టీడీపీలో 70 లక్షల మందిని అరెస్టు చేయగలరా అన్నారు. ఒక్కసారి బుర్ర తక్కువ సలహాదారుల బుర్రతో కాకుండా చదువుకున్న ఐపీఎస్‌ బుర్రతో ఆలోచించాలని, మీరు చేసేది ఎంత తప్పో తెలుస్తుందని అన్నారు. నాదెండ్ల బ్రహ్మాన్ని నిన్నట్నుంచి స్టేషన్ల చుట్టూ తిప్పి తిప్పి ఏదో చేయాలనుకున్నారని.. మీ ప్లాన్‌ బెడిసి కొట్టడంతోనే కొత్త డ్రామా మొదలు పెట్టారని లోకేష్‌ ఫైరయ్యారు.

నాదెండ్ల బ్రహ్మంపై ఈగ వాలనా డీజీపీదే బాధ్యత అన్నారు.. చట్టాన్ని అతిక్రమించి చేసిన ప్రతి అరెస్టుకూ.. పాల్పడిన ప్రతి అరాచకానికీ న్యాయస్థానాల ముందు తలదించుకుని దోషిగా నిలబడేందుకు సిద్ధంగా ఉండాలని లోకేష్‌ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story