సర్పంచ్‌ల హక్కులు కాలరాసేందుకే జీవో నెం.2 : నారా లోకేశ్

సర్పంచ్‌ల హక్కులు కాలరాసేందుకే జీవో నెం.2 : నారా లోకేశ్
సర్పంచ్‌ల హక్కులు కాలరాసేందుకే జీవో నెంబర్‌ 2ని తీసుకొచ్చారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.

సర్పంచ్‌ల హక్కులు కాలరాసేందుకే జీవో నెంబర్‌ 2ని తీసుకొచ్చారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా తెచ్చిన జీవోని వెంటనే రద్దు చేసి సర్పంచుల హక్కులు, అధికారాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని 73వ సవరణ చట్టం, ఆర్టికల్ 243G ద్వారా సర్పంచులకు కట్టబెట్టిన అధికారాలకు జగన్‌రెడ్డి తూట్లు పొడిచారని విమర్శించారు.

పార్టీ కార్యకర్తల పెత్తనం కోసం సర్పంచులను డమ్మీలను చేసే విధంగా జీవో తెచ్చారని ఆరోపించారు. జగన్‌రెడ్డి సీఎం అయ్యాక నియంత కంటే ఘోరంగా రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య పద్దతులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచుల నాయకత్వంలోనే సచివాలయ వ్యవస్థలు పనిచేస్తాయని చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడెందుకు మాట మార్చారని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story