జగన్ ప్రభుత్వానికి నారా లోకేష్ 48 గంటల డెడ్‌లైన్..!

జగన్ ప్రభుత్వానికి నారా లోకేష్ 48 గంటల డెడ్‌లైన్..!
జగన్ ప్రభుత్వానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 48 గంటల డెడ్‌లైన్ విధించారు. టెన్త్ పరీక్షలు రద్దు చేస్తారా లేక వాయిదా వేస్తారా అనేది ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు.

జగన్ ప్రభుత్వానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 48 గంటల డెడ్‌లైన్ విధించారు. టెన్త్ పరీక్షలు రద్దు చేస్తారా లేక వాయిదా వేస్తారా అనేది ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. అమరావతిలో డిజిటల్ టౌన్‌హాల్ సమావేశం నిర్వహించిన లోకేష్.. వర్చువల్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మొండి వైఖరితో విద్యార్ధుల జీవితాలకు పరీక్ష పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం టెన్త్ పరీక్షలు రద్దు చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేసారు. జగన్ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

టెన్త్ పరీక్షలు నిర్వహించాలన్న సీఎం జగన్‌ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు తీవ్రంగా మండిపడ్డారు. కరోనా భయంతో తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లని జగన్.. తమ పిల్లలకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పరీక్షలపై ఓటింగ్ పెట్టేలా ప్రభుత్వంపై ప్రతిపక్షం ఒత్తిడి తీసుకురావాలని తల్లిదండ్రులు లోకేష్‌ను కోరారు. అటు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యావేత్తలు తప్పుబట్టారు. ఏపీలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న వేళ విద్యార్థులకు టెన్త్ పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. పరీక్షల నిర్వహణ కంటే విద్యా విధానంలో మార్పు దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేయాలని విద్యావేత్తలు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story