Nara Lokesh : రుయా మరణాలు.. ప్రభుత్వ హత్యలే : నారా లోకేష్

Nara Lokesh : రుయా మరణాలు..  ప్రభుత్వ హత్యలే : నారా లోకేష్
ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆస్పత్రిలో సంభవించిన మరణాలు ముమ్మాటికీ వైఎస్ జగన్ సర్కారు చేసిన హత్యలేనని అన్నారు నారా లోకేష్..

ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆస్పత్రిలో సంభవించిన మరణాలు ముమ్మాటికీ వైఎస్ జగన్ సర్కారు చేసిన హత్యలేనని అన్నారు నారా లోకేష్.. అత్యంత ఆధునిక సౌకర్యాలున్న రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోయేంతవరకూ పట్టించుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకి అద్దం పడుతోందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

" పది మందికి పైగా మృతిచెందారని తెలిసి షాక్ కి గురయ్యాను. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అర్జంటుగా వారికి ఆక్సిజన్ అందించి కాపాడాలని కోరుతున్నాను. ఆక్సిజన్ అందక ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా రోగులు ప్రతీరోజూ మృతి చెందుతున్నా.. ముఖ్యమంత్రి కనీసం ఎందుకు ఇలా జరుగుతోందని ఆరా కూడా తీయడం లేదంటే, ప్రజల ప్రాణాలంటే ఎంత లెక్క లేనితనమో స్పష్టం అవుతోంది" అని అన్నారు.

అటు ఈ ఘటన పైన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. రుయా ఆసుపత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. అక్రమ కేసుల పెట్టడం పైన ఉన్న శ్రద్ధ ఆక్సిజన్ సరఫరా పైన లేదని అన్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే లెక్కలేకుండా శవాల దిబ్బపై రాజ్యమేలాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story