ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ షోకాజ్‌ నోటీసులు

ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ షోకాజ్‌ నోటీసులు
నంద్యాలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పోలీసులకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ అభిప్రాయ పడింది. పోలీసుల దాష్టీకం వల్లే ఈ ఘటన జరిగిందని... దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. ఈ కేసులో వాస్తవాలు కలవరపరిచేలా ఉన్నాయన్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ.... ప్రజా సేవకుల ద్వారా తీవ్రమైన మావన హక్కుల ఉల్లంఘన జరిగిందని షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొంది.

ఇక 6 వారాల్లోగా పరిహారాన్ని పిటిషనర్‌కు చెల్లించాలని ఎందుకు ఆదేశించకూడదో తెలియజేయాలని సీఎస్‌ను ఆదేశించింది ఎన్‌హెచ్‌ఆర్‌సీ. అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీఐడీకి అప్పగించాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో ప్రమేయమున్న పోలీసులపై శాఖాపరంగా తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో నివేదికను... నిర్దిష్ట వ్యవధిలో సమర్పించాలని సీఎస్‌ను, డీజీపీని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. కేసుకు సంబంధించి కర్నూలు ఎస్పీ ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. ఇక ఈ కేసుపై అక్టోబరు 4న విచారించనుంది ఎన్‌హెచ్‌ఆర్‌సీ.

Tags

Read MoreRead Less
Next Story