ఏపీలో ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ .!

ఏపీలో ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ .!
ఏపీలో విలయతాండవం చేస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది...ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని భావిస్తోంది.

ఏపీలో విలయతాండవం చేస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది...ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని భావిస్తోంది... ఈ కర్ఫ్యూ 2 వారాల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఉంటుంది.మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది... అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే దాదాపు 24 వేల కేసులు నమోదయ్యాయి. అంటే దాదాపు గంటకు వెయ్యిమంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది..

Tags

Read MoreRead Less
Next Story