తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో లోకేష్ దూకుడు

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో లోకేష్ దూకుడు
ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే పిచ్చోళ్లుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు లోకేష్ .

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేపట్టి ప్రభుత్వ ఆరాచకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లోకేష్ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.

ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్.. ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రానికి చెందిన 28 పిల్లులు మోదీ చుట్టూ తిరుగుతున్నాయని, మరో పిల్లిని ఢిల్లీ పంపడం అవసరమా అని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు ఏపీకి వెన్నుపోటు పొడుస్తున్నారని ఫైరయ్యారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే పిచ్చోళ్లుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.

తిరుపతి ఎన్నికల్లో వైసీపీ నేతలు వాలంటీర్లు, పోలీసులు, నకిలీ ఓటర్లను నమ్ముకున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ నాయకులు నకిలీ ఐడీ కార్డులు ముద్రించారని సమాచారం ఉందంటున్నారు. వైసీపీ నకిలీ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు కాలువ శ్రీనివాసులు. అటు.. ఇక చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెలుగు యువత నేతలు, కార్యకర్తలు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. జగన్ ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నగరంలో బిక్షాటన చేశారు. వైసీపీ ఆరాచక పాలనతో పరిశ్రమలన్నీ తిరుపతి నుంచి తరలిపోతున్నాయని శ్రీకాళహస్తి టీడీపీ ఇన్‌ఛార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో చంద్రబాబు అనేక పరిశ్రమలు తీసుకొస్తే.. వైసీపీ పాలనలో పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయని ఆరోపించారు. తిరుపతి ప్రాంత యువత, నిరుద్యోగులు ఉపాధి లేక బిక్షాటన చేసే పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు విమర్శించారు.


Tags

Read MoreRead Less
Next Story