మంత్రులు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపై ప్రివిలేజ్ కమిటీ చర్చ

మంత్రులు ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసుపై ప్రివిలేజ్ కమిటీ చర్చ
ప్రివిలేజ్ కమిటీ వ్యవహారంపై అనగాని సత్యప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రులు ఇచ్చిన నోటీసులపై ప్రివిలేజ్ కమిటీ చర్చించింది. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో.. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులో SECను పిలిపించవచ్చని కొందరు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐతే.. టీడీపీ సభ్యుడు అనగానికి సత్యప్రసాద్ ఈ వాదనతో విభేదించారు. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ మరోసారి సమావేశమై చర్చించాక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.

SECపై విచారణ జరిపే అధికారం కమిటీకి ఉందని ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. సభ్యులు తమ హక్కులకు భంగం కలిగిందని స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆ అంశాన్ని కమిటీకి పంపారని అన్నారు. రూల్ 173 కింది ఈ అంశంపై చర్చించామని కాకాణి వివరించారు. దీనిపై న్యాయ నిపుణులతో కూడా మాట్లాడిన తర్వాత నోటీసులు పంపాలా లేదంటే మరో విధంగా ముందుకు వెళ్లాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ప్రివిలేజ్ కమిటీ వ్యవహారంపై అనగాని సత్యప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కమిటీని ప్రభుత్వం తన నియంతృత్వ విధానాలకు వాడుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్‌పై మంత్రులు కూడా తీవ్ర విమర్శలు చేశారని వాటికి ఏం సమాధానం చెప్తారని అనగాని ప్రశ్నించారు. SECపై విమర్శలు చేసిన మంత్రులపై చర్యలు ఏవని నిలదీశారు. టీడీపీ నేతలు నోటీసులు ఇచ్చినప్పుడు స్పందిచని కమిటీ.. ఇప్పుడు ఆఘమేఘాలపై సమావేశం అవడం విడ్డూరంగా ఉందన్నారు.


Tags

Read MoreRead Less
Next Story