షర్మిలకు ఒక న్యాయం.. అమరావతి మహిళలకు ఒక న్యాయమా?: రఘురామ

షర్మిలకు ఒక న్యాయం.. అమరావతి మహిళలకు ఒక న్యాయమా?: రఘురామ
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. బెడ్స్‌ దొరికే పరిస్థితి లేదని రఘురామ అన్నారు.. కరోనా పేరుతో ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం ఎన్నికల నియమావళి ఉల్లంఘంచడమేనన్నారు.

షర్మిలపై నిన్నటి దాడి విషయాన్ని ప్రస్తావిస్తూనే సెటైర్లు పేల్చారు ఎంపీ రఘురామకృష్ణరాజు.. షర్మిలపై దాడి జరిగితే విజయమ్మ స్పందించారని, అమరావతి మహిళలపై దాడులు జరిగినప్పుడు, మగ పోలీసులు దారుణంగా హింసించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. అమరావతిలో కనీసం మహిళలను ఇళ్లలో నుంచి బయటకు రానివ్వడం లేదని మండిపడ్డారు. షర్మిలకు ఒక న్యాయం, అమరావతి మహిళలకు ఒక న్యాయమా అని ప్రజలు అనుకుంటున్నారని రఘురామ గుర్తు చేశారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. బెడ్స్‌ దొరికే పరిస్థితి లేదని రఘురామ అన్నారు.. కరోనా పేరుతో ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం ఎన్నికల నియమావళి ఉల్లంఘంచడమేనన్నారు.. ఇప్పుడు ముఖ్యమంత్రి చేయాల్సింది రాజకీయం కాదని అన్నారు.. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, ముఖ్యమంత్రి మాస్కు పెట్టుకుని ప్రభుత్వం ద్వారా ప్రకటన చేస్తే బాగుంటుందని రఘురామ హితవు పలికారు.

తనను విమర్శించిన వారికి నజరానాలు అందుతున్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఎంపీ నందిగం సురేష్‌ కోటి రూపాయల కారు కొనుక్కున్న విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.. నందిగం సురేష్‌తోపాటు రాష్ట్ర ప్రజలు కూడా కోటి రూపాయల కారు కోరుకుంటున్నారని, జగన్‌ అందరికీ ఇస్తారని ఆశిస్తున్నానంటూ రఘురామ సెటైర్లు వేశారు.

Tags

Read MoreRead Less
Next Story