అరాచకం పార్ట్‌ 2 మొదలైంది : రఘురామకృష్ణరాజు

అరాచకం పార్ట్‌ 2 మొదలైంది : రఘురామకృష్ణరాజు
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ అన్న పదమే లేదని తెలిశాక మరో కొత్త కోణంలో కేసులు పెడుతున్నారు అన్నారు రఘురామకృష్ణరాజు.

పోలీసులు, వార్డు వాలంటీర్ల ద్వారానే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి విజయం సాధ్యపడిందన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఇక్కడినుంచే తమ ప్రభుత్వ అధికార దుర్వినియోగం, అరాచకం పార్ట్- 2 మొదలైందన్నారు. రాష్ట్రంలో పోలిసులు భానిస భావజాలంతో పనిచేస్తున్నారని...ఇప్పుడు ప్రతిపక్ష నేతలపైనా కేసులు పెట్టడం మొదలైందని చెప్పారు. ఫిబ్రవరిలో ఫిర్యాదు నమోదైతే...ఎన్నికలైయ్యక చంద్రబాబుపై FIR నమోదు చేసి, ఫలితాల తర్వాత నోటీసులు ఇచ్చారని అన్నారు రఘురామకృష్ణరాజు.అసలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ అన్న పదమే లేదని తెలిశాక మరో కొత్త కోణంలో కేసులు పెడుతున్నారని అన్నారు. ఇది ముమ్మాటికి కక్షతో చేసిన చర్యే అన్నారు రఘురామకృష్ణరాజు.

తనకున్న సమాచారం మేరకు మే 6న రాజధానిని విశాఖ తరలించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు రఘురామకృష్ణరాజు. కానీ కోర్టులు అందుకు అంగీకరించవని స్పష్టం చేశారు..తనపై పెట్టిన అక్రమ కేసుల కొట్టివేతకు కోర్టులో పిటిషన్ వేస్తే... ప్రభుత్వం సమాధానం చెప్పకుండా గడువు కోరిందని మండిపడ్డారు.. అనవసర కేసుల్లో వాదనల కోసం కోటానుకోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలో సీ వాటర్ స్కాం జరుగుతోందని ఆరోపించారు రఘురామకృష్ణరాజు. కృష్ణా, గోదావరి మిగులు జలాలున్న రాష్ట్రానికి సముద్రజలాల శుద్ధి ప్లాంట్ అవసరమా అని ప్రశ్నించారు. ప్రజాధనం దోపిడీ చేసేందుకు మరో మార్గం ఎంచుకున్నారని ఆరోపించారు..పోలవరం, పోతిరెడ్డిపాడు పూర్తిచేసి ప్రజల అవసరాలు తీర్చకుండా వృథా ప్రాజెక్టులు పెట్టొద్దని హితవుపలికారు..సంక్షేమం పేరుతో జరుగుతున్న ప్రజా ధన దుర్వినియోగంపై ప్రజలు ప్రశ్నించాలన్నారు రఘురామకృష్ణరాజు.


Tags

Read MoreRead Less
Next Story