ఏపీలో రేషన్ డెలివరీ వాహనాలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ఎస్ఈసీ

ఏపీలో రేషన్ డెలివరీ వాహనాలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ఎస్ఈసీ
అప్పటిదాకా గ్రామాల్లో వాహనాలతో రేషన్ పంపిణీ నిలిపివేయాలని తెలిపింది.

ఏపీలో రేషన్ డెలివరీ వాహనాలపై SEC కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఇంటింటికి రేషన్‌ పంపిణీపై ఆంక్షలు విధించిది..డెలివరీ వాహనాల రంగులను మార్చాలని ఎస్ఈసీ ఆదేశించింది. పార్టీలకు సంబంధంలేని రంగులు వేసి.. ఆ వాహనాలను తమకు చూపించాలని పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీచేసింది. అప్పటిదాకా గ్రామాల్లో వాహనాలతో రేషన్ పంపిణీ నిలిపివేయాలని తెలిపింది. ఎంపీటీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలి కాబట్టి మార్చిన రంగులతోనే వాహనాలు తిరగాలని పేర్కొన్నారు. హైకోర్టు సూచన మేరకు రెండ్రోజుల క్రితం రేషన్ వాహనాలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిశీలించారు.

వాహనాలపై ఇతర రంగులు ఉన్నా.. ప్రముఖంగా వైసీపీ రంగులు పోలినవే కన్పిస్తున్నాయని ఎస్ఈసీ తెలిపారు. వాహనంపై సీఎం జగన్, మాజీ సీఎం వైఎస్సార్ బొమ్మలు ఉన్నాయని.. ఇలా ఫోటోలను ఉపయోగించడం హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమన్నారు. జనవరి 21న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా.. అదే రోజున సీఎం జగన్ పథకం ప్రారంభించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story