కలెక్టర్లు, అధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్

కలెక్టర్లు, అధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతం సవాంగ్, పలు శాఖల ముఖ్యకార్యదర్శలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో SEC నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతం సవాంగ్, పలు శాఖల ముఖ్యకార్యదర్శలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ, వ్యాక్సినేషన్‌ పంపిణీ అంశాలపై చర్చిస్తున్నారు. అటు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల కలెకర్లతో పాటు జడ్పీ సీఈవోలు, ఎంపీడీవోలు కూడా పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో చేయాల్సిన ఏర్పాట్లు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు SEC నిమ్మగడ్డ రమేష్‌ కుమార్.

అంతకుముందు గవర్నర్ బిశ్వభూషణ్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కలిశారు. విడివిడిగా గవర్నర్ తో భేటీ అయిన ఇరువురు పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై చర్చించారు. దాదాపు 10 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది.

అటు గుంటూరు జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన జేసీ దినేష్ కుమార్ కలెక్టరేట్ లో ఎస్ఈసీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కలెక్టర్ తో పాటు గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ్ వర్మ, అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ, జిల్లా అధికారులు హాజరయ్యారు.


Tags

Read MoreRead Less
Next Story