ఆంధ్రప్రదేశ్‌లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్న సోనూసూద్

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్న సోనూసూద్
ఏదో నలుగురికి సాయం చేసి తన పని అయిపోయిందనుకోలేదు సోనూసూద్. తన సేవలు నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు.

ఏదో నలుగురికి సాయం చేసి తన పని అయిపోయిందనుకోలేదు సోనూసూద్. తన సేవలు నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆపన్నులకు అన్నివేళలా తానున్నానంటూ భరోసా ఇస్తున్నాడు. సెకండ్ వేవ్ తో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారు ఎందరో.

ఆక్సిజన్ కోసం రోగులు పరుగులు పెడుతున్నారు ఆస్పత్రి వైపు. ఈ క్రమంలో ఆస్పత్రులలో ఆక్సిజన్ ప్లాంట్ల అవసరాన్ని గుర్తించారు సోనూసూద్. ఇప్పటికే యుఎస్, ఫ్రాన్స్ నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించేందుకు నడుంబిగించారు. ఈ ప్లాంట్లను వివిధ రాష్ట్రాల్లోని అవసరమైన ఆస్పత్రులలో ఏర్పాటు చేయనున్నారు.

మొదటి రెండు ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆయన బృందం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసే పనిలో ఉంది. తరువాత నెల్లూరులో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే తీసుకున్నారు.

ఈ ప్లాంట్ నెల్లూరు, కర్నూలుతో పాటు పొరుగు గ్రామాలలో ఉన్న వేలాది మంది కోవిడ్ బాధితులకు ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్, రామ్ సుందర్ రెడ్డి ఐఎఎస్ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్లాంట్ గురించి మాట్లాడుతూ సోనూసూద్ సహృదయానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము.

ఆయన ఏర్పాటు చేసిన ఈ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 150 నుండి 200 మంది కోవిడ్ రోగులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది అని అన్నారు.

సోనూసూద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఇది చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్ తరువాత జూన్, జూలై మధ్య మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాం అని ఆయన తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story