జగన్‌కు 151 మంది ఎమ్మెల్యేలున్నా.. చంద్రబాబు ఫోబియా పట్టుకుంది : బుద్దా వెంకన్న

జగన్‌కు 151 మంది ఎమ్మెల్యేలున్నా.. చంద్రబాబు ఫోబియా పట్టుకుంది :  బుద్దా వెంకన్న
జగన్‌కు 151 మంది ఎమ్మెల్యేలున్నా.. చంద్రబాబు ఫోబియా పట్టుకుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. భౌతికంగా, రాజకీయంగా చంద్రబాబును అంతమొందించాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్‌కు 151 మంది ఎమ్మెల్యేలున్నా.. చంద్రబాబు ఫోబియా పట్టుకుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. భౌతికంగా, రాజకీయంగా చంద్రబాబును అంతమొందించాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సీబీఐ కార్యాలయంచుట్టు తిరిగారు కాబట్టి..‌ చంద్రబాబును సీఐడీ కార్యాలయం చుట్టుతిప్పాలని చూస్తున్నారని అన్నారు. బీహార్ కంటే ఘోరంగా ఏపీలో పరిస్థితున్నాయని, బాబుకు నోటీసులు దుర్మార్గమని బుద్దా వెంకన్న అన్నారు.

జగన్‌పై సీబీఐ కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇప్పుడు చంద్రబాబుకు CID నోటీసులు ఇప్పించారని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాల్సింది చంద్రబాబుపై కాదని, 30 ఏళ్లపాటు దళితుల భూమి అనుభవించింది వైఎస్ కుటుంబమేనని అన్నారు. జగన్‌పై కేసులున్నాయి కాబట్టి.. చంద్రబాబుపైనా కేసులు పెట్టి అందరూ అవినీతిపరులు అని చెప్పాలనేదే జగన్ తాపత్రయమని అది జరగదని వర్ల అన్నారు.

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై ఆపార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్‌.రమణ మండిపడ్డారు. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే సీఐడీ ద్వారా నోటీసులు పంపించారని ఆరోపించారు. న్యాయస్థానం అమరావతి భూముల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తీర్పు ఇచ్చినా జగన్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఎల్‌.రమణ విమర్శించారు.

రాజకీయ కక్షతోనే చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి కొల్లురవీంద్ర ఆరోపించారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగితే ఇన్ని రోజులు ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు..ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ అమరావతికి మద్దతు ఇచ్చారన్న సంగతి మర్చిపోయారా అని నిలదీశారు కొల్లు రవీంద్ర. ఏపీలో తమిళనాడు సంస్కృతిని అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు హాస్యాస్పదమన్నారు టీడీపీ మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు. సీఐడీ కేసు నమోదు వెనుక కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. అమరావతి భూముల్లో వ్యాపారం లేదని కోర్టు ఇప్పటికే చెప్పిందని.. ఐనా.. అబద్ధాలపై ఆధారపడి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో మినీ ప్యాలస్ ఎవరి భూముల్లో కట్టారో జగన్ చెప్పాలని నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story