తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడే దమ్ము జగన్‌కు ఉందా? : టీడీపీ ఎంపీలు

తనపై ఉన్న కేసుల గురించి మాట్లాడే దమ్ము జగన్‌కు ఉందా? : టీడీపీ ఎంపీలు
జగన్‌పై అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టే టీడీపీ నేతలపైనా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు సీఐడీ నోటీసులపై టీడీపీ నేతలు మండిపడ్డారు. దీని వెనుక కుట్ర ఉందని.. అబద్ధాలపై ఆధారపడి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ రెడ్డి దళిత ద్రోహి అని ఫైర్ అయ్యారు. సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో డొల్లతనం కనిపిస్తోందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం దృష్టి మరల్చేందుకే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు.

చంద్రబాబుకి సీఐడీ నోటీసులు పంపడంపై టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై దృష్టి మరల్చేందుకే ఈ తప్పుడు కేసులు పెట్టారని ఫైరయ్యారు. తనపై కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల గురించి మాట్లాడే దమ్ము జగన్‌కు ఉందా అని నిలదీశారు టీడీపీ ఎంపీలు. జగన్‌పై అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టే టీడీపీ నేతలపైనా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు..ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

అటు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఫిబ్రవరిలో ఫిర్యాదు చేస్తే.. ఎన్నికలయ్యాక చంద్రబాబుపై FIR నమోదు చేసి, ఫలితాల తర్వాత నోటీసులు ఇచ్చారని ఇది ముమ్మాటికి కక్షతో చేసిన చర్యే అన్నారు రఘురామకృష్ణరాజు.

Tags

Read MoreRead Less
Next Story