మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నివాసం దగ్గర ఉద్రిక్తత..!

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నివాసం దగ్గర ఉద్రిక్తత..!
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది..

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మైనింగ్‌ పరిశీలనకు బయలుదేరిన కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు.. కోవిడ్‌ నిబంధనల పేరుతో ఆయన పర్యటనను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది..

సీఎం జగన్‌ తన అవినీతి బయటపడుతుందని కంగారు పడుతున్నారని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. కొండపల్లిలో అక్రమమైనింగ్‌ జరగకపోతే టీడీపీ నేతల పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు కూడా చట్టానికి లోబడి విధులు నిర్వహించాలని హితవు పలికారు.. కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మైలవరం ఎమ్మెల్యే అక్రమంగా మైనింగ్‌ చేస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

సీఎం జగన్‌ రాష్ట్రంలో ప్రతిపక్షాలను పూర్తిగా అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి నుంచి టీడీపీ నాయకులను వెంటాడుతున్నారని.. అధికార పార్టీ నాయకుల ఊరేగింపులు, సభలు సమావేశాలకు కరోనా నిబంధనలు అడ్డురావా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story