తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ

తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్థరాత్రి నుంచి టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. ఐదు ప్రాంతాలు 50 కౌంటర్లలో టోకెన్లు ఇస్తున్నారు.

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అర్థరాత్రి నుంచి టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. ఐదు ప్రాంతాలు 50 కౌంటర్లలో టోకెన్లు ఇస్తున్నారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ఎంఆర్‌ పల్లె మార్కెట్‌, రామానాయుడు మున్సిపల్‌ స్కూల్‌, మున్సిపల్‌ ఆఫీసుల దగ్గర ప్రత్యేక క్యూ లైన్లలో టోకెన్లు జారీ చేస్తున్నారు. రాత్రి రెండు గంటల నుంచి టీటీడీ అధికారులు టోకెన్లు ఇస్తున్నారు. స్థానికులతో పాటు స్థానికేతరులకు శ్రీవారి దర్శనం కల్పించేదుకు టికెట్లు ఇస్తున్నారు.

అయితే పది రోజుల పాటు ఇవ్వాల్సిన టోకెన్లను ఒకేరోజు ఇచ్చేస్తున్నారు. అసలు 10రోజుల్లో దాదాపు 4లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటికే 25, 26, 27 తేదీలకు ఇవ్వాల్సిన పూర్తయిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్య టీటీడీ ముందుగానే టోకెన్లు ఇస్తుంది. దీంతో స్థానికేతరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం సుదూరు ప్రాంతాల నుంచి వస్తే టోకెన్లు అయిపోయాయని పంపేస్తున్నారని మండిపడ్డారు.

రేపటి నుంచి జనవరి 3వ తేదీ వరకు శ్రీవారు వైకుంఠ ద్వారం గుండా దర్శనమిస్తారు. జనవరి 3న మళ్లీ ఆలయ ఉత్తర ద్వారాలు మూసివేస్తారు. రేపు వేకువజామున 12 గంటల 5 నిమిషాలకు ఆలయాన్ని అర్చకులు తెరవనున్నారు. ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం 4 గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు దర్శనాన్ని ప్రారంభించనున్నారు.

రేపు ఉదయం 9 గంటలకు స్వర్ణరధంపై శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎల్లుండి ద్వాదశిని పురస్కరించుకొని చక్రతాళ్వార్‌కు వరాహ పుష్కరిణిలో చక్రస్నానాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. అయితే దర్శన టోకెన్లు ఉన్న వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story