Tirumala : శ్రీవారి భక్తులకు మరో షాక్.. !

Tirumala : శ్రీవారి భక్తులకు మరో షాక్.. !
Tirumala : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలని టీటీడీ యోచిస్తోంది.

Tirumala : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలని టీటీడీ యోచిస్తోంది. సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులు ధనవంతులని నిర్ధారణకు వచ్చిన టీటీడీ... ఆ మేరకు ఆర్జిన సేవా టికెట్ల ధరలు పెంచనుంది. అయితే సామాన్య భక్తులకు మినహాయింపు ఇవ్వనున్నారు. ఇప్పటికే లడ్డూ ధరలు, అద్దె గదులు, వివిధ సేవా టికెట్ల ధరలను పెంచిన టీటీడీ... ఆర్జిత సేవా టికెట్ల ధరలను పదింతలు చేయాలని చూస్తోంది. టీటీడీ నిర్ణయాలు శ్రీవారి భక్తులకు పెనుభారంగా మారుతున్నాయి.

కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో శ్రీవారి ఆర్జిత సేవలన్నింటిని పునరుద్దరించి, భక్తులకు సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో టీటీడీ నిర్ణయించింది. అయితే సుప్రభాతం 2వేలు... తోమాల, అర్చన 5వేలు... కళ్యాణోత్సవం రెండున్నర వేలు... వేద ఆశీర్వచనం 10వేల చొప్పున సేవా టికెట్ల ధరలను పెంచాలని అధికారులకు బోర్డు సూచించింది.

ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. సామాన్య భక్తులకు కేటాయించే సేవా టికెట్టు ధరలను మాత్రం పెంచడం లేదని, పాత ధరలకే అందజేస్తామన్నారు. సిఫార్సులను తగ్గించి, సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ చెప్పడాన్ని భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీటీడీ పాలకమండలి..ధార్మిక సంస్థను వ్యాపార కేంద్రంగా మార్చేస్తోందని మండిపడుతున్నారు.

కరోనా ప్రభావంతో రెండేళ్లుగా శ్రీవారి సేవల్లో పాల్గొనే భాగ్యానికి దూరమైన భక్తులకు టీటీడీ ఈ నిర్ణయం షాకింగ్‌గానే చొప్పొచ్చు. టీటీడీ పెంపు నిర్ణయ యోచనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story