టీవీ5 ఎఫెక్ట్ : కర్నూలు జిల్లా వైసీపీ నేతపై కేసుకు రంగం సిద్ధం

టీవీ5 ఎఫెక్ట్ : కర్నూలు జిల్లా వైసీపీ నేతపై కేసుకు రంగం సిద్ధం

కర్నూలు జిల్లా మండిగిరిలో గ్రామ సచివాలయ ఉద్యోగిపై జులుం ప్రదర్శించిన వైసీపీ నేతపై కేసు పెట్టి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఏవో నరేంద్రపై దాడి చేయడం, తీవ్ర దుర్భాషలాడుతూ అతను ప్రవర్తించిన తీరుపై ఉన్నతాధికారులు ఇప్పటికే విచారణ చేపట్టారు. వైసీపీ నేత కల్లుబోతు సురేష్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతామని ఆదోనీ ఎంపీడీవో, సచివాలయం స్పెషల్ ఆఫీసర్ గీతావాణి స్పష్టం చేశారు. అటు, సురేష్ ప్రవర్తించిన తీరుపై సచివాలయ ఉద్యోగులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విధులు బహిష్కరించి గ్రామ సచివాలయం వద్ద నిరసన చేపట్టారు. నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

గ్రామ సచివాలయ ఉద్యోగిపై దుర్భాషలాడుతూ, భౌతిక దాడికి దిగిన సురేశ్‌.. అధికారపార్టీ నేతననే జులం చూపించాడు. మహిళా ఉద్యోగుల సమక్షంలో అసభ్య పదాలతో తిడుతూ.. కుర్చీలు విసిరేసి వీరంగం ఆడాడు. తన పనులు ఎందుకు పెండింగ్‌ పెట్టారంటూ నానా హంగామా సృష్టించాడు. ఈ విషయాన్ని టీవీ5 వెలుగులోకి తేవడంతో కేసు రాజీకి ప్రయత్నాలు కూడా చేశారు. ఉద్యోగులు మాత్రం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story