టీవీ5 ఎఫెక్ట్.. మహిళా రేషన్ డీలర్ పై దాడి చేసిన వైసీపీ నాయకుడిపై ఎఫ్ఐఆర్

టీవీ5 ఎఫెక్ట్.. మహిళా రేషన్ డీలర్ పై దాడి చేసిన వైసీపీ నాయకుడిపై ఎఫ్ఐఆర్

ఏపీలో వైసీపీనేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దళితులు, మైనార్టీలపై దాడులు చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు.. ఇప్పుడు మహిళలపైనా దాడులకు దిగుతున్నారు. కృష్ణాజిల్లా జిల్లాలో మహిళ రేషన్ డీలర్ పై దాడి చేశాడు వైసీపీ నేత. దుందిరాలపాడు గ్రామానికి చెందిన మహిళా రేషన్ షాప్ డీలర్ గంధంకుమారిపై అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత చప్పిడి రాంబాబు దాడి చేశాడు. రేషన్ షాపుకి రాంబాబు వచ్చాడని, సర్వర్ ఆగిపోయిందని చెప్పినట్లు తెలిపింది గంధంకుమారి. అయితే ... ఎప్పుడూ వచ్చినా... సర్వర్ బిజీగానే ఉంటుందా అంటూ రాంబాబు తనను కులంపేరుతో దూషించాడంటూ కన్నీరుపెట్టుకుంది బాధితురాలు. అంతేకాకుండా వీఆర్వో, ఎమ్మార్వో ఫోన్ నెంబర్లు ఇవ్వాలని బెదిరించి తన ఫోన్ పగులగొట్టాడని ఆవేదన వ్యక్తంచేసింది. రేషన్ షాపు లేకుండా చేస్తానని, కులం తక్కువైనా నీ దగ్గర రేషన్ తీసుకోవాలా అని దారుణంగా మాట్లాడడని వాపోయింది.

ఈ దాడికి సంబంధించిన వార్తను టీవీ5 ఛానెల్ వరస కథనాలు ప్రసారం చేసింది. దీంతో వైసీపీ నేత రాంబాబుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఈ దాడికి సంబంధించిన వార్తను టీవీ5 ఛానెల్ ప్రసారం చేయడంతో తనకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేసింది బాధితురాలు. ఈ వార్త ప్రసారం చేసి తనకు న్యాయం చేసినందుకు టీవీ5 ఛానెల్ కు డీలర్ గంధం కుమారి ధన్యవాదాలు తెలిపారు. టీవీ5 వార్త ప్రసారం చేయడంతో స్పందించిన పోలీసులు రాంబాబుపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఎఫ్ఐఆర్ కాపీని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు డీలర్ గంధంకుమారికి అందజేశారు.

రాంబాబుపై గతంలో పలు కేసులున్నట్లు తెలుస్తోంది. ఓ కేసులో జైలుకు కూడా వెళ్లివచ్చినట్లు చెబుతున్నారు పోలీసులు. ఎట్టకేలకు అతనిపై కేసు నమోదు చేయడంతో... ఆనందం వ్యక్తం చేస్తున్నారు బాధితురాలు.



Tags

Read MoreRead Less
Next Story