విశాఖ డాక్టర్ సుధాకర్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ

విశాఖ డాక్టర్ సుధాకర్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ
విశాఖలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే సీబీఐ సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

విశాఖలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే సీబీఐ సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరింత లోతుగా విచారణ జరపాలని ఆదేశించింది..పర్యవేక్షణాధికారిగా అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించాలని ఆదేశించింది న్యాయస్థానం. మార్చి 31లోగా నివేదిక అందించాలని స్పష్టం చేసింది..తదుపరి విచారణ ఏప్రిల్ మొదటివారానికి వాయిదా వేసింది.

అప్పట్లో డాక్టర్ సుధాకర్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ప్రభుత్వం ఆయనపట్ల అనుసరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా వైరస్ వ్యాపిస్తున్నా ప్రభుత్వం డాక్టర్లకు N95 మాస్కులు కూడా ఇవ్వడం లేదంటూ డాక్టర్ సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన పాపానికి సుధాకర్‌ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. సుధాకర్ ఫాల్స్‌ న్యూస్‌ను ప్రచారం చేస్తున్నారంటూ ఏప్రిల్ 8న ఆయనపై వేటు వేసింది.

అటు ఈ ఘటన తర్వాత నడిరోడ్డుపై పోలీసులు డాక్టర్ సుధాకర్ పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించారు. ఆయన చేతులు వెనక్కి విరిచికట్టిన తీరుపై ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. చివరికి డాక్టర్ సుధాకర్‌పై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఓ దశలో ఆయనపై పిచ్చోడిగా ముద్రవేశారు. దీనిపై సుధాకర్ తల్లి కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు సుధాకర్ కేసును CBIకి అప్పగించింది.


Tags

Read MoreRead Less
Next Story