Chandrababu Naidu : చంద్రబాబు శపథానికి ముందు ఏం జరిగిందంటే..?

Chandrababu Naidu :  చంద్రబాబు శపథానికి ముందు ఏం జరిగిందంటే..?
Chandrababu Naidu : శాసనసభకు రాకూడదని చంద్రబాబు ప్రకటన చేయడానికి ముందు.. తన ఛాంబర్‌లో చంద్రబాబు అత్యవసరంగా టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు.

Chandrababu Naidu : శాసనసభకు రాకూడదని చంద్రబాబు ప్రకటన చేయడానికి ముందు.. తన ఛాంబర్‌లో చంద్రబాబు అత్యవసరంగా టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. మండలి సమావేశం నుంచి హుటా హుటిన లోకేష్, యనమల సహా ఇతర ఎమ్మెల్సీలను పిలిచి మాట్లాడారు. శాసనసభలో వైసీపీ సభ్యుల తీరు దారుణంగా ఉందని, కొందరు సభ్యులు శృతిమించి మాట్లాడుతున్నారనే అభిప్రాయం ఎమ్మెల్యేలంతా వ్యక్తం చేశారు.

కుటుంబంలోని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. సభలో వైసీపీ సభ్యులు కామెంట్లు చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు కుటుంబంలోని మహిళలపై వైసీపీ ఎమ్మెల్యేలు దారుణంగా ఉన్నాయని, సభలోనే నోరు పారేసుకుంటున్నారని మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. స్పీకర్ మౌనంగా ఉంటూ వైసీపీని కట్టడి చేయడం లేదని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఈ నేపథ్యంలో సభలో పరిణామాలు చూస్తోంటే తీవ్ర ఆవేదన కలుగుతోందని చంద్రబాబు అన్నారు.

ఇవాళ వైసీపీ సభ్యుల తీరుపై సభ ప్రారంభంలోనే నిరసన తెలిపారు చంద్రబాబు. మంత్రి కొడాలి నాని తీవ్రంగా నోరుపారేసుకుంటూ మాట్లాడడంతో దాన్ని తీవ్రంగా ఖండించారు. పోడియం వద్దకు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. వైసీపీ సభ్యుల వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాగైతే సభ నుంచి వాకౌట్ చేస్తామని టీడీపీ ప్రకటించింది. ఐనా.. పదే పదే ఎదురుదాడి చేస్తూ, మైక్ ఇవ్వకుండా విమర్శల దాడి కొనసాగిస్తుండడంతో చివరికి సభను వదిలి వెళ్లారు. మళ్లీ CM అయ్యాకే సభలో అడుగుపెడతానని శపథం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story