రాకెట్ లాంఛింగ్ శ్రీహరి కోట నుంచే చేయడానికి కారణమేమిటంటే..

రాకెట్ లాంఛింగ్ శ్రీహరి కోట నుంచే చేయడానికి కారణమేమిటంటే..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు గుండెకాయలా సేవలందిస్తోంది నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట. సముద్ర తీర ప్రాంతంలో శ్రీహరి కోట రాకెట్ ప్రయోగాలకు అనుకూలంగా ఉంది. అయితే దేశంలో చాలా రాష్రాలకు తీర ప్రాంతాలు ఉన్న ఇక్కడి నుంచే ప్రయోగాలు ఎందుకు చెస్తున్నారు. అసలు ఈ ప్రాంత ప్రత్యేకత ఎంటో ఓ సారి చూద్దాం..దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. గుజరాత్ అధికంగా సముద్రతీర ప్రాంతం కలిగిన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ కన్నా అధికంగా సముద్రతీర ప్రాంతం ఆ రాష్ట్రానికే ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడే నుంచే రాకెట్ ప్రయోగాలు జరుగుతుంటాయి. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ఉపగ్రహాలు ఇక్కడి నుంచే ప్రయోగిస్తుంటారు.. ఎందుకు అంటే? అన్ని విధాలా రాకెట్ ప్రయోగాలకు అత్యుత్తమ ప్రదేశం శ్రీహరికోట. ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన రాకెట్ ప్రయోగ కేంద్రంగా పేరుగాంచింది.

ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 13 డిగ్రీల అక్షాంశ వాలులో ఉండటంతో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్రావిటేషన్ పవర్ తక్కువగా ఉండటంతో రాకెట్ ప్రయోగాలకు అనువుగా ఉంటుందని భావించారు. భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం.. ఇక్కడి నుంచి రాకెట్‌ ప్రయోగిస్తే గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిస్తోందని భావించిన శాస్త్రవెత్తలు ఇక్కడి నుంచే రాకేట్ల్‌ను ప్రయోగిస్తుంటారు. శ్రీహరికోట తూర్పు తీరంలో ఉంది. భూమి పశ్చిమం నుంచి తూర్పు దిశగా తిరుగుతూ ఉంటుంది. తూర్పు దిశ నుంచి రాకెట్‌‌ను ప్రయోగిస్తే, భూ పరిభ్రమణ వేగం కారణంగా అదనపు వెగంతో దూసుకువెళుతుంది. అందుకే ప్రపంచంలో ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాలు అన్నీ భూమధ్య రేఖకు సమీపంగానే ఏర్పాటు చేశారు

Tags

Read MoreRead Less
Next Story