YS Jagan: సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ..

YS Jagan (tv5news.in)

YS Jagan (tv5news.in)

YS Jagan: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.

YS Jagan: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ జగన్ పిటీషన్‌పై విచారణ చేపట్టారు. అయితే సీబీఐ వాదనల కోసం విచారణను ధర్మాసనం ఈనెల 6కు వాయిదా వేసింది.

సీబీఐ కోర్టు కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన హాజరుకు బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు సీఎం జగన్.

సీఎం రోజువారి విచారణకు హాజరైతే.. ప్రజా పాలనకు ఇబ్బంది కల్గుతుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసమే వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు కోరుతున్నట్లు జగన్ కోరారు. తన వల్ల విచారణ జాప్యం జరుగుతుందన్న సీబీఐ వాదనలో నిజం లేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story