వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐని కలిసిన సునీత

వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐని కలిసిన సునీత
తన తండ్రిది రాజకీయ హత్యే అని చెప్పారు సునీత.

తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం ఎంతకాలం నిరీక్షించాలని వైఎస్.వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి అన్నారు. ఢిల్లీలో సీబీఐ అధికారులను ఆమె కలిసారు. వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిది రాజకీయ హత్యే అని చెప్పారు. ఈ హత్య కేసు గురించి వదిలేయమని తనకు చాలా మంది సలహా ఇచ్చారని.. తన మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు ఘటనపై అధికారులు చేసిన అవహేళన వ్యాఖ్యలను వివరించిన సునీత.. తన తండ్రి ఓ మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయి అని చెప్పారు. తమకే న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదని ఆరోపించారు. సాక్షులకు హానీ జరుగుతుందోమోనని భయమేస్తుందన్న సునీత.. ఈ అన్యాయంపై పోరాటంలో తనకు అందరి సహకారం కావాలని కోరారు.

వైఎస్.వివేకానందరెడ్డి హత్య జరిగిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు సునీత. పోస్టుమార్టం రిపోర్టులో కాలేయం, కిడ్నీలలో రక్తం గడ్డకట్టిందని చెప్పారు. హత్య జరిగే సమయంలో ఎస్సైగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డినే విచారణ అధికారిగా నియమించడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. అలాగే సీఎం జగన్‌ ఇచ్చిన లేఖ, ఇతర రాజకీయ నాయకులు ఇచ్చిన లేఖ రెండు వేర్వేరుగా ఉన్నాయి. హైకోర్టులో వేసిన పిటిషన్‌లో నాకు అనుమానం ఉన్నవాళ్లు పేర్లు రాశాను. అనుమానితుల పేర్ల జాబితాలో ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి సహా పలువురు పేర్లను పిటిషన్‌లో పేర్కొన్నామన్నారు. కేసు ఆలస్యమైతే ఆధారాలు కూడా దొరక్కుండా పోయే ప్రమాదముందని సునీత చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story