YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడి ఆవేదన.. తనకు రక్షణ కరువైందంటూ..

YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడి ఆవేదన.. తనకు రక్షణ కరువైందంటూ..
YS Viveka Case: పులివెందులలో తనకు రక్షణ కరువైందని.. భద్రత కల్పించాలంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు దస్తగిరి.

YS Viveka Case: పులివెందులలో తనకు రక్షణ కరువైందని.. భద్రత కల్పించాలంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి. తనకు భద్రత నిమిత్తం ఇద్దరు పోలీసులను కేటాయించామని జిల్లా ఎస్పీ చెబుతున్నా.. వారెవ్వరూ తన ఇంటి వద్ద కాపలా ఉండడం లేదని వాపోయాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారీ సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌కు ఫోన్ చేసి చెప్పాలంటే కష్టమవుతుందన్నారు.

పులివెందులలో ఎక్కడికి వెళ్లాలన్నా తనకు భయంగా ఉందని.. సెక్యూరిటీగా ఎవరూ తన వద్ద ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వైలెన్స్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారని.. పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని వెల్లడించారు. తన ప్రాణాలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని దస్తగిరి ప్రశ్నించారు. భద్రత కావాలంటూ కోర్టుకు వెళ్లినా.. లాభం లేదని.. లోలోపలో ఏదో జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story