ఈమె వయసు తెలిస్తే షాక్.. 16ఏళ్ల పడుచు పిల్లలా ఇంత అందంగా..

అందంతో పందెం వేస్తా.. అందర్నీ నేనాటాడిస్తా.. ప్రపంచం మొత్తం నావైపే చూసేలా చేస్తా.. అంటోంది 51 ఏళ్ల ఈ యంగ్ బ్యూటీ సియావో. ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు.. మీరు వయసులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండేవారో అంటే 60 ఏళ్ల బామ్మ పెదవులపై ముడతలు పడ్డ చర్మం చాటున ముసి ముసి నవ్వులు కనిపిస్తాయి. కానీ 51 ఏళ్ల వయసున్న ఈ బ్యూటీకి మాత్రం ఎక్కడా వయసు కనిపించదు. దేవతలు తాగే అమృతం ఈమెకేమైనా దొరికిందేమో అని అనిపించకమానదు. తైవాన్‌కు చెందిన సియావో 20 ఏళ్లుగా టీవీ సీరియల్స్‌లో నటిస్తూ పాపులర్ అయింది. 1989లో తైవానీస్ రొమాంటిక్ డ్రామా టీవీ సిరీస్‌లో లీడ్ రోల్ పోషించింది.

1996లో వచ్చిన ‘ఏ సర్టైన్ ఆఫ్ లవ్ డ్రీమ్’ అనే టీవీ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యింది. ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగని అందంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 344,000 మంది ఈమెకు ఫాలోయర్లు ఉన్నారు. మీ అందానికి కారణమేంటి.. మీ వయసు పెరుగుతుంది కానీ.. మీ అందం తరగట్లేదేంటి అని సియావోని అడిగితే యోగానే నా బ్యూటీ సీక్రెట్ అని అంటోంది. 10 సంవత్సరాలుగా యోగా, స్విమ్మింగ్ చేస్తానంటోంది. ఇంకా కొద్ది సేపు తన పెంపుడు జంతువులతో ఆడుకుంటుంది. ఇక ఫుడ్ విషయానికి వస్తే ప్యూర్ వెజిటేరియన్. ఇదేనండి నా ఆరోగ్యం.. నా అందం అంటోంది. 1968లో పుట్టిన సియావో 16 ఏళ్ల పడుచుపిల్లలతో కలిసి ర్యాంప్ వాక్ చేసి అందరి చూపులు తనవైపు తిప్పుకుంటుంది.

నేను ఎప్పుడూ సీఎం కావాలని అనుకోలేదు

తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి ఆశించలేదన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి. తనపై కొందరు కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ వైపు మళ్లారని, నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఎదురుతిరిగారని జానా చెప్పారు. లోక్‌సభ ఎన్నికలను ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

కోడలిపై మామ కన్ను.. దుస్తులు చింపి..

కొత్త కోడలు కోటి ఆశలతో అత్తింట అడుగు పెట్టింది. కొడుకుతో కాపురం చేస్తున్న కోడలిపై మామ కన్ను పడింది. కూతురులా చూడాల్సిన కోడలిని తన కామ వాంఛలు తీర్చుకోవడానికి బలి చేయాలనుకున్నాడు. కర్ణాటక కోణనకుంటె గ్రామానికి చెందిన ఓ యువతి మ్యాట్రిమొనీ ద్వారా పరిచయమైన కుమార్‌ని వివాహం చేసుకుంది. అత్తింటికి వచ్చిన కొద్ది రోజులకే మామ చూపుల్లోని ఆంతర్యాన్ని గ్రహించింది ఆమె. ఇదే విషయాన్ని భర్తతో చెబితే భార్యనే తప్పు పట్టాడు. మా నాన్న అలాంటి వాడు కాదని అన్నాడు. అయినా ఆమె వినలేదు. ఈ ఇంట్లో ఉండొద్దు మనిద్దరం విడిగా ఉందాము అని భర్తని ఒప్పించింది.

వేరు కాపురం పెట్టి అత్తమామలకు దూరంగా ఉంటున్నారు భార్యాభర్తలు. అయినా అక్కడికి కూడా వచ్చి కోడలిని మామ లైంగిక వేధింపులకు గురి చేస్తుండడంతో ఇదే విషయమై మరో సారి భార్య భర్తల మధ్య గొడవైంది. దాంతో కుమార్ ఇంటికి రావడం మానేశాడు. అత్తగారు వచ్చి కోడలి మీద గొడవకు దిగింది. ఆమెను ఇంటి బయటకు ఈడ్చుకు వచ్చి దుస్తులు చింపి అవమానించింది. తప్పంతా కోడలిదే అని గ్రామస్తుల ముందు అవమానించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

భయపెట్టింది.. మెప్పించింది.. ఆలోచింపజేసింది.. ‘లిసా’ దెయ్యం.. మూవీ రివ్యూ

విడుదల తేదీ : మే 24, 2019
నటీనటులు : అంజలి, యోగి బాబు, మైమ్ గోపి
దర్శకత్వం : రాజు విశ్వనాథ్
నిర్మాత : సురేష్ కొండేటి
సంగీతం : సంతోష్ దయానిధి
సినిమాటోగ్రఫర్ : పి జి ముత్తయ్య
హీరోయిన్ అంజలి కి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఎలాంటి పాత్రలో అయినా మెప్పించే ప్రతిభ కలిగిన అంజలి లిసాగా భయపెట్టేందుకు రెడీ అయ్యింది. హార్రర్ సినిమాలు బాక్సాఫీస్ ఫార్ములాగా మారిన ట్రెండ్ లో లిసా ఎంత వరకూ భయపెట్టిందో చూద్దాం…
కథ :
లిసా(అంజలి) ఇండిపెండెంట్ గా పెరిగిన అమ్మాయి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అంజలి యుఎస్ వెళ్ళటానికి సిద్దం అవుతుంది. తల్లిదండ్రులు ప్రేమ వివాహం చేసుకోవడంతో వారికి బంధువులు ఎవరూ ఉండరు. దీంతో అమ్మ ఒంటరిగా ఉండటం ఇష్టం లేక తల్లికి మళ్ళీ పెళ్ళిచేయాలనుకుంటుంది. కానీ ఆమె పెళ్ళికి అంగీకరించదు. తల్లిని ఒప్పించాలంటే వారి తల్లిదండ్రులతోనే సాధ్యం అవుతుందని అమ్మమ్మ,తాతయ్య దగ్గరకు వస్తుంది. లిసా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింటికి వచ్చాక ఆమెకు అక్కడ కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరి అంజలి ఆ సమస్యలనుండి బయటపడిందా..? అమ్మమ్మ, తాతయ్యలతో తన కుటుంబం కలిసిందా..? అనేది మిగిలిన కథ..?
కథనం:
‘లిసా’ ఇప్పటి వరకూ వచ్చిన అన్ని హార్రర్ సినిమాల ఫార్మెట్ లకు విభిన్నంగా ఉంది. ఎందుకంటే లవ్ అండ్ కామెడీ లాంటి ఎమోషన్స్ ని హార్రర్ బ్యాక్ డ్రాప్ లో చెప్పడం రొటీన్ అయిన టైం లో లిసా వాటి జోలికి వెళ్ళకుండా కథనం కొనసాగించింది. లిసా పాత్రలో అంజలి చాలా అందంగా కనిపించింది. జర్నీ టైం లో అంజలి చూసిన ఫీల్ కలిగింది. ఇక ఆ పాత్ర తాలూకు ఎమోషన్స్ ని తెరమీదకు తీసుకురావడంలో అంజలి పూర్తి విజయం సాధించింది. లిసా తన తల్లి కోసం అమ్మమ్మ, తాతయ్య దగ్గరకు వస్తుంది. కానీ అక్కడ పరిస్థితులు చాలా అనుమానాస్పదంగా ఉంటాయి. ప్రతి రోజూ భయంగానే గడుస్తుంది. ఒక సందర్భంలో అమ్మమ్మ పాత్ర పోషించిన నటి దెయ్యంగా అనిపిస్తుంది. ఒక సీన్ లో అమ్మ మీద కోపం పోలేదా అని అడిగిన లిసా గొంతు మీద కత్తి పెట్టి పోలేదు అంటుంది అమ్మమ్మ. ఆ సీన్ తర్వాత సినిమా చాలా గ్రిప్ గా నడుస్తుంది. మకరంద్ దేష్ పాండే పాత్ర కూడా చాలా అనుమానాస్పదంగా కనిపిస్తుంటుంది. త్రీడి ఎఫెక్ట్ లో హార్రర్ ఎఫెక్ట్ లు చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది. అమ్మమ్మ, తాతయ్యలు ఎందుకు అలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు..? అసలు అక్కడి నుండి బయటపడటం సాధ్యం అయ్యే పనేనా ..? అనే సస్పెన్స్ ని గ్రిప్పింగ్ గా నడపడంలో దర్శకుడు రాజు విశ్వనాథ్ సక్సెస్ అయ్యాడు. లిసా లోకి ఆత్మ ప్రవేశించాక జరిగే ఎపెక్ట్ లు చాలా బాగున్నాయి. లిసా పాత్రలోకి వచ్చిన ఆత్మ ఎవరు..? అనే సస్పెన్స్ ని ఊహించడం కూడా కష్టం అవుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ప్రేక్షకుల ఊహను ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తూ కథనం నడిపాడు. ఒక హార్రర్ సినిమాకు ఉండే ప్రాధమిక లక్షణాలను ఎక్కడా కోల్పోకుండా కొత్తగా కథనం నడిచింది. ఇక సినిమా మెయిన్ థీమ్ కొస్తే ఒక సమాజంలో జరుగుతున్న ఎవరూ పెద్డగా పట్టించుకోని ఒక సమస్యను దర్శకుడు తీసుకున్న విధానం చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసే అంశంతో కథను ఎండ్ కొచ్చే సరికి ఒక ఎమోషనల్ పాయింట్ గా మలిచాడు. తల్లిందండ్రులను పట్టించుకోని పిల్లలు, వారిని తలుచుకుంటూ గడిపే చివరి క్షణాలు ఎంత మనో వేదనను గురిచేస్తాయో చాలా ఎమోషనల్ గా చిత్రీకరించాడు దర్శకుడు. శంకర్, మురుగుదాస్ సినిమాలలో ఉన్నంత సోషల్ మెసేజ్ ని లిసా తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తమను తాము చూసుకునే సమస్యను దర్శకుడు ఎంచుకున్న విధానానికి అభినందించాల్సిందే. ఇక లిసా భయపెట్టడంలో సక్సెస్ అయి ఆలోచింపజేయడంలో ముందుంది.
బ్రహ్మానందం కామెడీ ట్రాక్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సంతోష్ ధయానిధి అందించిన మ్యూజిక్ కథలోని ఎమోషన్స్ బాగా ఎలివేట్ చేసింది. పిజి ముత్తయ్య సినిమాటోగ్రఫీ బాగుంది. లిసా హార్రర్ సినిమా కథలలో డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది.
చివరిగా:
భయపెట్టిన లీసా ఆలోచింపజేసింది. హార్రర్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ మెసెజ్ ని క్యారీ చేయడంలో టీం సక్సెస్ అయ్యింది.

కార్పోరేట్లో పదికి పది వస్తే ప్రచారాలు..అదే గవర్నమెంట్ స్కూల్ వారికి వస్తే..

కార్పోరేట్ విద్యాసంస్థల్లో పదికి పది జీపీఏ సాధించిన విద్యార్ధులకు సన్మానాలు… ఫ్లెక్సీలతో ప్రచార ఆర్బాటాలు… ప్రశంసలు. మరి ప్రభుత్వ పాఠశాల్లలో చదువుకున్న విద్యార్థులు కూడా కష్టపడి చదువుకొని 10/10 జీపీఏ సాధించిన వారు చాలా మంది ఉన్నారు. మరి వారిని ఎవరు పొగడాలి, వారి గురించి ఎవరు ప్రచారం చేయాలి..? వీరి పేదరికం ఎవరికి స్పూర్తి కావాలి..? ఇలా ఆలోచించే వారే లేరా..? కనీసం వీరు 10/10 జీపీఏ సాధించామని చెప్పుకునేందుకు ఓ వేదిక కూడ లేదా? ఇలాంటి ప్రశ్నలు వెల్లువెత్తుతున్న తరుణంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ర్యాంకులు సాధించిన పేద విద్యార్థులలో మనో ధైర్యాన్ని నింపి… భావితరాలకు ఈ విద్యార్ధులు స్పూర్తి దాతలు అయ్యేలా సమాజానికి చాటి చెప్పారు.

వరంగల్‌ జిల్లా పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులను తానే స్వయం వెళ్ళి తన క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. వారికి మంచి విందు ఏర్పాటు చేశారు. వారితో సరదాగా గడిపారు…. ఆప్యాయంగా పలకరించి ఆత్మీయత పంచి ఘనంగా సత్కరించారు. ప్రశంసాపత్రాలు అందజేశారు. పేదరికం ర్యాంకులు సాధించడానికి అడ్డుకాదని సూచించారు. పై చదువుల్లో కూడా ఇదే విధంగా రాణించాలని ఆశీర్వదించారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాఠశాల విద్యా శాఖ కళ్లు తెరిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు విద్యార్థులకు అభినందన కార్యక్రమాలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. కార్పోరేట్ స్కూళ్లపై మోజుతో పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకునే తల్లిదండ్రులు…ఈ మట్టిలో మాణిక్యాలను చూసి గుణపాఠం చేర్చుకోవాలని హితవు పలికారు. ఇలా జిల్లా కలెక్టర్ తమకు విందు ఇచ్చి అభినందించడంతో పేద విద్యార్థుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విద్యార్థులను వెన్నుతట్టి ప్రోత్సహించిన ఉపాధ్యాయులను కూడా కలెక్టర్‌ ఘనంగా సత్కరించారు.

ఊహించిందే జరిగింది..

ఊహించిందే జరిగింది. రాహుల్ రాజీనామాను CWC తిరస్కరించింది. హాట్ హాట్ గా ప్రారంభమైన ఈ భేటీలో మొదట రాహుల్ రాజీనామాపైనే చర్చ జరిగింది…చెప్పినట్లుగానే ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని ప్రతిపాదించారు రాహుల్.. అయితే ఇందుకు సీడబ్ల్యూసీ అంగీకరించలేదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని..విజయం కోసం చాలా కృషి చేశామని ..వ్యతిరేక ఫలితాలు వచ్చినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన పని లేదని పలువురు నేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు….కావాలనే కొందరు రాహుల్ ను టార్గెట్ చేస్తున్నారని… ఈ కష్టకాలంలో పార్టీ రాహుల్ కు అండగా నిలబడాలన్నారు….లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని ఘోర పరాజయం తర్వాత రాహుల్ పై ఒత్తిడి పెరిగిపోయింది. అటు రాహుల్ కూడా గతంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతే అధ్యక పదవి నుంచి తప్పుకుంటానని చెప్పారు. చెప్పినట్లుగానే రాహుల్ రాజీనామాకు సిద్ధపడ్డారు కానీ సీడబ్ల్యూసీ ఇందుకు అంగీకరించలేదు..గతంలో సోనియా గాంధీ కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు… అప్పుడు కూడా ఆ నిర్ణయాన్ని CWC తిరస్కరించింది…

ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్‌ నేతలు గలాం నబీ ఆజాద్‌, మల్లికార్జున్‌ ఖర్గే, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరం పరాభవంపైనా సమావేశంలో చర్చ జరుగుతోంది..కాంగ్రెస్ దాదాపు 17 రాష్ట్రాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో అయితే కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ముఖ్యంగా పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథీ నుంచి రాహుల్ ఓడిపోవడాన్ని పార్టీ జీర్ణించుకోలేక పోతోంది.. పైగా ప్రియాంకా గాంధీని రంగంలోకి దించినా పెద్దగా ఉపయోగపడలేదు… ఆమె ముఖ్యంగా యూపీపైనే ఎక్కువ ఫోకస్ చేశారు..అమేథీ, రాయబరేలీలోనూ ప్రచారం నిర్వహించారు.. అయినా మోడీ వేవ్ ముందు ఇవేమీ పనిచేయలేదు….

దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గత కొన్నేళ్లుగా తన ప్రభను కోల్పోతూ వస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2 చోట్ల గెలుపొందిన పార్టీ.. ఈ సారి ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితమైంది. అటు ఒడిశాలోనూ కాంగ్రెస్‌ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. మొత్తం 21 లోక్‌సభ స్థానాలుండగా.. కేవలం ఒకే ఒక్క చోట కాంగ్రెస్‌ గెలుపొందింది. ఇక 147 అసెంబ్లీ స్థానాల్లో 9 చోట్ల మాత్రమే విజయం సాధించగలిగింది. అటు ఇప్పటికే యూపీ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజ్‌ బబ్బర్‌, ఒడిశా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ తమ రాజీనామాలు రాహుల్ కు పంపారు.

ఎంపీగా టాలీవుడ్ హీరోయిన్..

ఎంపీగా పోటీ చేసిన మొదటి ప్రయత్నంలోనే అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ నవనీత్ కౌర్. ఆర్‌పి పట్నాయక్ అంధుడిగా నటించిన చిత్రం శీను వాసంతి లక్ష్మి చిత్రంలో నటించిన కౌర్ తన నటనకు గాను ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మహారాష్ట్ర ఎమ్మెల్యే రవి రాణాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆమె కూడా రాజకీయాల్లో ప్రవేశించింది. మహారాష్ట్ర అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి శివసేన పార్టీ అభ్యర్థిపై 30 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. భర్త రాణా మొదటి నుంచి యువ స్వాభిమాన్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. కౌర్ కూడా అదే పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది లోకసభలో అడుగుపెట్టనుంది. ఆమెకు 5 లక్షల 10 వేల ఓట్లు పోలయ్యాయి. కౌర్ భర్త రవి రాణా యోగా గురు బాబా రాందేవ్‌కు మేనల్లుడు. 2011లో 3100 మందికి జరుగుతున్న సామూహిక వివాహ మహోత్సవంలో రవి రాణా, నవనీత్ కౌర్ జంట కూడా ఒకటి.

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సీఎస్‌..

ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార ఏర్పాట్లపై..సచివాలయంలో సీఎస్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష.ప్రమాణస్వీకారం నిర్వహించాల్సిన ప్రదేశాన్ని ఖరారు చేసే అవకాశం.విజయవాడ పరిసర ప్రాంతాల్లో విశాలమైన ప్రదేశంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం.సమీక్షకు హాజరైన డీజీపీ ఠాకూర్‌, విజయవాడ సీపీ..సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌తో పాటు పలువురు అధికారులు

వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

గుంటూరు జిల్లా శ్రీనివాసపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అది ఏకంగా ఇప్పుడు పరస్పరం దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. కత్తులు, కర్రలు, మారణాయుధాలు ఒకటేంటి.. చేతికి ఏం దొరికితే దాంతో దాడి చేయడంతో.. పలువురికి గాయాలయ్యాయి. మహిళలు కూడా గొడవకు దిగారు. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలకు చెందిన కొందరిని అరెస్టు చేశారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

సుధీర్.. రష్మీ.. హీరో హీరోయిన్లుగా..

బుల్లితెరపై ఈ జంట చేసే సందడి ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. అడపా దడపా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించే సుధీర్ ఇప్పుడు తనే హీరోగా ఓ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి ఇంద్రజ, షియాజీ షిండే, పోసాని కృష్ణమురళి వంటి నటులు ముఖ్యపాత్ర పోషించనున్నారు. పూర్తి ఫ్యామిలీ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మరి హీరోయిన్‌గా రష్మీనే తీసుకుంటారని అనుకున్నారంతా. కానీ రష్మీని కాకుండా రాజుగారి గది చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ధన్యా బాలకృష్ణ.. నేను శైలజ, రన్ రాజా రన్, చిన్నదాన నీకోసం, భలే మంచిరోజు వంటి సినిమాల్లో కనిపించింది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం.. జులై చివరి వారంలో విడుదలకు సిద్ధమవుతోంది.