Tv5 Telugu News Channel :: Latest Andhra News, Latest News in Telugu, Tollywood News and Gossips, India News, Picture Galore, Telugu Movie News, Latest Sports news, ICC World Cup 2011
 
""
logo tv5
SocialTwist Tell-a-Friend
రాజీకొస్తున్న రాసలీలల నిత్యానంద స్వామి


AA

రాసలీలల నిత్యానందులవారు మారుమనసు పొందారు. మచ్చ తుడిపేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. శేషజీవితం ఎలా గడపాలన్న అంశంపై ఓ నిర్ణయానికొచ్చారు. స్వామివారు ఇకపై బుద్ధిగా వుంటానని చెప్పకనే చెప్పేశారు. స్పిరిట్యువల్ సెక్యులరిస్టుగా ఇప్పుడాయనది కొత్త అవతారం.
నీలిచిత్రాలు బుల్లితెరపై చేసిన నాట్యం.. నిత్యానందుల వారి గుట్టును రట్టు చేసింది. ఆధ్యాత్మిక ముసుగును తప్పించి అసలు రంగును చాటిచెప్పింది. ముఖం చెల్లక కొన్నాళ్లు అజ్ఞాతంలోకెళ్లిపోయిన స్వామివారు.. తర్వాత తర్వాత అడపాదడపా మీడియా ముందుకొస్తున్నారు. ఐదుసెక్షన్లపై బిదాడి పోలీసులు పెట్టిన కేసులు స్వామీజీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. కర్నాటక హైకోర్టులో వేసిన పిటిషన్‌ కూడా చింపివేతకు గురవడంతో పశ్చాత్తాపం నటించక తప్పట్లేదాయనకు. ఆశ్రమబాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటన ఇందులో భాగమే.
ధర్మానంద సహా కీలక అనుచరులంతా తిరుగుబాటు చేయడం కూడా నిత్యానందకు మింగుడుపడడం లేదు. అందుకేనేమో.. మిగులు జీవితాన్ని పక్కా స్పిరిట్యువల్‌గా షురూ చేస్తానంటున్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక లౌకకత్వం అనే కొత్త మాటను సృష్టించుకుని దాన్ని పాటిస్తానని హామీ ఇచ్చారు.

రంజితతో మొదలైన నిత్యానందుల కామాయణం ఇప్పట్లో ముగిసేలా లేదు. యువరాణి ఎట్సెట్రాల వీడియోలు కూడా నెటిజన్లను అలరిస్తున్నాయిప్పుడు. సో.. పాత వాసనను ఆయన మర్చిపోగలిగినా.. జనం బాగా గుర్తుపెట్టుకుంటారు కనుక మచ్చ మచ్చగానే మిగిలిపోవడం ఖాయం.
Related Articles
Gallery