నేటితో ముగియనున్న కసబ్ కేసు విచారణ

ముంబై దాడులకు తెగపడి వందలాది మంది మృత్యువుకు కారకుడైన కసబ్ పై విచారణ ఈరోజుతో ముగిసే అవకాశాలున్నాయి. ఆర్ధర్ జైలు రోడ్డులో జరుగుతున్న విచారణలో కసబ్ తరపున పవార్, ప్రభుత్వం తరపున ఉజ్వల్ నికమ్ వాదిస్తున్నారు. ఈ కేసులో మొత్తం 653 మంది సాక్ష్యులను విచారించగా, మరో 30 మంది ప్రత్యక్ష సాక్ష్యుల వాంగ్మూలం కూడా రికార్డు చేశారు. దాదాపు 11 వేల పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. ఇందులో పరాయి దేశంలోకి అక్రమంగా చొరబాటు, ఆయుధాల చేరవేత, హింసకు కుట్ర, తదితర ఆరోపణలపై ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. ముంబై దాడులకు పాల్పడిన పది మంది టెర్రరిస్టుల్లో పోలీస్ కస్టడీలో వున్న ఏకైక టెర్రరిస్టు కసబ్.
Click Here to View/Post Comments (3)
| REDDY :
KILL THAT PAKISTANI TERRORIST
Varun :
hi..good judgement...do it asap..
Varun :
hi
|
|||
|
Don't post rude or nasty comments. Ethnic slurs, personal insults and abuses are rather uncool. Criticise, but know where to draw the line. No point putting in personal details or links, we won't publish them. |


