Gangubai Kathiawadi: 'గంగూబాయి కతియావాడి' సినిమాపై వరుసగా కేసులు..

Gangubai Kathiawadi: గంగూబాయి కతియావాడి సినిమాపై వరుసగా కేసులు..
Gangubai Kathiawadi: గంగుబాయి కతియావాడి.. ఒక వేశ్య నుండి మాఫియా క్వీన్‌గా మారిన మహిళ.

Gangubai Kathiawadi: ఒక బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రతీ చిన్న అంశాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మూవీ టీమ్ అంతా ఇలాంటి లీగల్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం గుంగుబాయికి కూడా ఇలాంటి కష్టాలే వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమాపై ఓ కేసు నమోదవ్వగా మరో కేసుతో కోర్టును ఆశ్రయించారు కొందరు ప్రేక్షకులు.

గంగుబాయి కతియావాడి.. ఒక వేశ్య నుండి మాఫియా క్వీన్‌గా మారిన మహిళ. తన గురించి ముంబాయిలోని వేశ్యగృహాల్లో కొంతమందికి తెలిసినా.. మరికొందరికి ఈ సినిమాతో పరిచయం చేయాలనుకుంటున్నాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. అయితే అప్పట్లో గంగుబాయి నివసించే రెడ్ లైట్ ఏరియాను సినిమాలో కమతిపురగా చూపించారు. ఆ విషయం కమతిపుర స్థానికులకు నచ్చలేదు.

గంగుబాయి సమయం నుండి ఇప్పటికీ ముంబయిలో.. అందులోనూ కమితపురలో చాలా మార్పులు వచ్చాయి. రియల్ ఎస్టేట్ పరంగా కూడా కమతిపుర చాలా అభివృద్ధి చెందిందని, గంగుబాయి కతియావాడి సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత కమతిపురకు ఉన్న పేరు అంతా పోయిందని ఒక ప్లీ దాఖలు చేశారు అక్కడి స్థానికులు.

స్థానికులతో పాటు లోకల్ ఎమ్మెల్యే అమీన్ పటేల్ కూడా వారికి మద్దతునిచ్చారు. శుక్రవారం విడుదల కానున్న గంగుబాయి కతియావాడి సినిమా మీద ఇంతకు ముందు కూడా పరువునష్టం దావా కేసు ఫైల్ అయ్యింది. గంగుబాయి దత్తతు తీసుకున్న బాబూజీ షా ఈ కేసును ఫైల్ చేశారు. దీనిపై మూవీ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Tags

Read MoreRead Less
Next Story