గంగూబాయి.. కామాటిపుర ప్రెసిడెంట్‌

గంగూబాయి.. కామాటిపుర ప్రెసిడెంట్‌
ప్రేమించిన ప్రియుడు రూ.500లకు తననకు కామాటిపురాలో అమ్మేసి పారిపోయాడు. అదో వేశ్యాగృహం.. అక్కడే జీవితం గడపాలని తెలుసుకుని బావురుమంది.

ప్రేమించి పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు.. పట్నం తీసుకెళ్తానంటే ఊహల్లో తేలిపోయింది. అక్కడ జీవితం ఎంత బావుంటుందో అనుకుంటుంది. అతడి చేయి పట్టుకుని రైలెక్కింది. కానీ అక్కడికి వెళ్లిన తరువాత తెలిసింది తానెంత మోసపోయానో అని.. ప్రేమించిన ప్రియుడు రూ.500లకు తననకు కామాటిపురాలో అమ్మేసి పారిపోయాడు.

అదో వేశ్యాగృహం.. అక్కడే జీవితం గడపాలని తెలుసుకుని బావురుమంది. చేసేదేం లేక జీవితాన్ని సాగిస్తూ రాటు దేలింది. ఈ క్రమంలో పెద్ద డాన్ అయిన కరీం లాల్‌కు చెందిన వ్యక్తి ఆమెపై అత్యాచారం చేయడంతో, దాన్ని సహించలేని గంగూబాయి డాన్‌ని కలుస్తుంది. అతడు ఆమెకు రక్షగా ఉంటానని చెప్పి రాఖీ కడతాడు.

ఇదంతా ముంబైలోని కామాటిపురకు చెందిన గంగూబాయి రియల్ స్టోరీ.. దీనికి కొన్ని హంగులు అద్ది అలియాభట్‌ని పెట్టి సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. హిందీ టీజర్ రిలీజ్ కాగా తాజాగా తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగూ ఉంటుంది. అన్న పవర్‌ఫుల్ డైలాగ్‌తో గంగూబాయి కతియావాడి టీజర్ మొదలైంది.

ప్రయోగాలకు పెట్టింది పేరైన అలియా భట్ గంగూబాయి పాత్రలో ఒదిగి పోయింది. గౌరవంతో బతకాలి, ఎవ్వరికీ భయపడకూడదు, పోలీసుకైనా, ఎమ్మెల్యేకైనా, మంత్రికైనా, వాడి అమ్మ మొగుడుకైనా.. ఎవ్వడికీ భయపడకూడదు, నేను గంగూబాయిని ప్రెసిడెంట్ ఆఫ్ కామాటిపుర. మీరు కుమారి అంటూనే ఉన్నారు. నన్ను ఎవరూ శ్రీమతి చేసింది లేదు అని చెబుతున్న డైలాగులు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక కరీం లాలా పాత్రను అజయ్ దేవగణ్ పోషిస్తున్నాడు. ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags

Read MoreRead Less
Next Story