Kiara Siddharth Marriage: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న మరో బాలీవుడ్ జంట.. డేట్ ఫిక్స్..!

Kiara Siddharth Marriage: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న మరో బాలీవుడ్ జంట.. డేట్ ఫిక్స్..!
Kiara Siddharth Marriage: గత రెండేళ్లలో చాలామంది బాలీవుడ్‌లో సీనియర్, అప్‌కమింగ్ నటీనటులు పెళ్లిపీటలెక్కారు.

Kiara Siddharth Marriage: గత రెండేళ్లలో చాలామంది బాలీవుడ్‌లో సీనియర్, అప్‌కమింగ్ నటీనటులు పెళ్లిపీటలెక్కారు. కోవిడ్ సమయంలో కూడా చాలా తక్కువ మంది సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా పెళ్లి చేసుకున్నవారు ఉన్నారు. అయితే మరో రెండు బాలీవుడ్ జంటలు వచ్చే ఏడాది వివాహ బంధంతో ఒకటవ్వడానికి సిద్ధమవుతున్నాయి.

రణభీర్ కపూర్, ఆలియా భట్.. చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్య వీరు అధికారికంగా వారి ప్రేమ గురించి ప్రకటించేశారు కూడా. కానీ పెళ్లి గురించి అడిగితే మాత్రం.. ఈ ఇద్దరు సమాధానం మాత్రం చెప్పట్లేదు. కానీ 2022లో వీరు వివాహం ఖరారు చేసుకున్నట్టు బీ టౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరో జంట కూడా 2022లో వారి పెళ్లిని గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా.. ఈ ఇద్దరు కలిసి చేసింది ఒక్క సినిమానే. కానీ వీరి కెమిస్ట్రీ చూసి వీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ కియారా, సిద్ధార్థ్ మాత్రం దీని గురించి పెద్దగా స్పందించలేదు. గత కొన్నిరోజులుగా వీరు ఎక్కువగా బయట కెమెరాలకు చిక్కతుండడంతో వీరి రిలేషన్‌షిప్ చాలా సీరియస్ అని అందరు ఫిక్స్ అయిపోతున్నారు.

మెల్లగా కియారా, సిద్ధార్థ్ కూడా వారి రిలేషన్‌షిప్ గురించి హింట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే త్వరలోనే వారి రిలేషన్ గురించి అధికారికంగా ప్రకటిస్తామని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా కియారా, సిద్ధార్థ్ కూడా 2022లో పెళ్లి పీటలెక్కనున్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరు చేస్తున్న సినిమాలు పూర్తవ్వగానే వీరు కూడా పెళ్లి చేసుకుంటారన్న రూమర్ గట్టిగా వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story