బాలీవుడ్ విలక్షణ నటుడు దిలీప్‌కుమార్‌(98) కన్నుమూత..!

బాలీవుడ్ విలక్షణ నటుడు దిలీప్‌కుమార్‌(98) కన్నుమూత..!
Dileep kumar : బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ఇక లేరు. వృద్ధాప్యంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ ఉదయం కన్నుమూశారు.

Dileep kumar : బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ఇక లేరు. వృద్ధాప్యంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ ఉదయం కన్నుమూశారు. 98 ఏళ్ల వయసున్న దిలీప్ కుమార్ ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 7 గంటల 30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. గత వారం ఆయన హిందూజ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. దిలీప్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన భార్య సైరా భాను సోమవారం తెలిపారు. మీ అందరి ప్రార్థనల వల్ల దిలీప్ కుమార్ త్వరలోనే డిశ్చార్జి అవుతారని నమ్ముతున్నట్లు చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశారు.

దిలీప్‌కుమార్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటని ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సినిమా లెజెండ్‌గా ఆయన ఎప్పుడూ గుర్తిండిపోయాతారని చెప్పారు.

దిలీప్‌కుమార్ ఒక్కో సినిమా ఒక్కో ఇండియన్ సెల్యూలాయిడ్ వండర్. తరాలు మారినా.. ఆయన సినిమాల్లో వన్నె తగ్గలేదు. నేటికీ నిత్యనూతనంగా ప్రేక్షకులను అలరిస్తూనే వున్నాయా చిత్రాలు. అదే దిలీప్ కుమార్ సినిమాల్లోని ఘనత. 1944లో జ్వార్ భాటాతో మొదలైన ఆయన నటప్రస్థానం.. ఖిలా సినిమా వరకు కొనసాగింది. కేవలం హావభావాలతో ప్రేక్షకులను అలరించడం దిలీప్ జీ స్పెషాలిటీ.

ఎన్నో ఉదాత్త పాత్రలు పోషించి.. అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన దిలీప్ కుమార్..1922 డిసెంబర్ 11న పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. వ్యాపార రీత్యా దిలీప్ ఫ్యామిలీ బాంబేకి షిప్ట్ అయింది. 1940లో దిలీప్ కుమార్.. పూనే మిలీటరీ కాంటీన్‌కు పండ్లు సప్లై చేసేవారు. ఆ కాంటీన్‌కు రెగ్యులర్‌గా వచ్చే ప్రముఖ నటి దేవికారాణి, ఆయన భర్త హిమాంశురాయ్ దృష్టిలో పడ్డారాయన. అలా వారు తీయబోయే నెక్ట్స్ మూవీ జ్వార్ భాటాలో దిలీప్‌కు హీరోగా చాన్స్ ఇచ్చారు. ఆ మూవీకీ స్క్రిప్ట్ రాస్తున్న ప్రముఖ రచయత భగవతీ చరణ్ వర్మ, యూసఫ్ ఖాన్ స్క్రీన్ నేమ్.. దిలీప్ కుమార్‌గా ఛేంజ్ చేశారు.

తొలి సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయినా నటుడిగా దిలీప్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. 1947లో విడుదలైన జుగ్ను సినిమాతో ఆయన కెరీర్ టర్న్ తీసుకుంది. ఈ సినిమా విజయంతో దిలీప్ కుమార్ వెనుదిరిగి చూడలేదు. తర్వాతి రోజుల్లో రిలీజైన దీదార్, అమర్, యాహుది, మధుమతి, దేవదాసు చిత్రాలు ఆయన నటజీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ సినిమాల సక్సెస్‌తో.. దిలీప్ బాలీవుడ్ ట్రాజెడీ కింగ్‌గా పేరు సాధించారు. ఇక దేవదాస్‌లో దిలీప్ పోషించిన భగ్నప్రేమికుడి పాత్ర ఎంతో ప్రత్యేకం.

Tags

Read MoreRead Less
Next Story