సవాళ్లు కొత్తేమీ కాదు.. ఎదుర్కొంటాను : శిల్పాశెట్టి

సవాళ్లు కొత్తేమీ కాదు.. ఎదుర్కొంటాను : శిల్పాశెట్టి
పోర్నోగ్రపీపై విచారణ చేస్తున్న ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు ఇప్పుడు ఆన్‌లైన్ బెట్టింగ్ యవ్వారాన్ని కూడా బయటకు తీశారు.

రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. పోర్నోగ్రపీపై విచారణ చేస్తున్న ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు ఇప్పుడు ఆన్‌లైన్ బెట్టింగ్ యవ్వారాన్ని కూడా బయటకు తీశారు. అడల్ట్ కంటెంట్‌ ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేయడం ద్వారా సంపాదిస్తున్న డబ్బంతా కుంద్రా బెట్టింగుల్లో పెడుతున్నాడు. దీనిపై విచారణకు అతను సహకరించడం లేదు కాబట్టి మరో వారం కస్టడీ పొడిగించాలని పోలీసులు కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఈనెల 27 వరకూ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్తు ఆదేశాలిచ్చింది. హాట్‌షాట్స్ లాంటి యాప్స్ ద్వారా పోర్న్‌ ఫిల్మ్‌ పెట్టి ప్రతిరోజూ లక్షలకు లక్షలు తన అకౌంట్‌లో వేసుకుంటున్నాడు.

తర్వాత ఆ డబ్బుతోనే బెట్టింగ్‌లు కాస్తున్నారు. రాజ్‌కుంద్రాకు చెందిన యస్‌బ్యాంక్ అకౌంట్‌ అలాగే యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రియా అకౌంట్ల మధ్య లావాదేవీలపై పూర్తిస్థాయి విచారణకు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 7.5 కోట్లు సీజ్ చేసిన పోలీసులు.. మొత్తం గుట్టు రట్టు చేసేందుకు సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్నారు. అటు, విచారణలో భాగంగా రాజ్‌కుంద్రాను జుహూలోని అతని నివాసానికి తీసుకెళ్లిన సెర్చ్ టీమ్‌ అదనపు సమాచారం కోసం దర్యాప్తు కొనసాగిస్తోంది. శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు. ఆమె స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేశారు.

అశ్లీల చిత్రాలతో డబ్బులు సంపాదించేందుకు ఎన్ని దారులున్నాయో అన్నింట్లోనూ రాజ్‌కుంద్రా వేలుపెట్టినట్టు విచారణలో బయటపడింది. అతని ల్యాప్‌ టాప్ సీజ్ చేసి డేటా రికవరీ చేస్తున్న పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇప్పటివరకూ 48 టీబీ డేటా రికవర్ చేశారు. ఇందులో 4 టీబీ కేవలం అడల్ట్ కంటెంట్‌ ఫొటోలు. అలాగే ఓ 51 అడల్ట్ కంటెంట్ సినిమాలున్నాయి. హాట్‌షాట్‌, శాన్‌బాక్స్‌ యాప్స్‌లో పోర్న్ కంటెంట్‌ను కూడా సీజ్ చేశారు. హాట్‌షాట్స్‌ లాంటి యాప్స్‌ని గూగుల్‌, యాపిల్ డిజేబుల్ చేస్తే మరో ప్లాట్‌ఫామ్ సిద్ధంగా ఉంచుకునేందుకు ప్లాన్ బీ కూడా కుంద్రా దగ్గర ఉందని పోలీసులు తెలిపారు.

ఇక పోర్నోగ్రఫీ కేసులో కస్టడీలో ఉన్న రాజ్‌కుంద్రాకు కస్టడీ అవసరం లేదని, బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు అడ్వొకేట్ వాదనలు వినిపించారు. OTT కంటెంట్‌కు సంబంధించి IT చట్టం సెక్షన్‌ 67 వర్తించదని ఆయన అన్నారు. ఐతే.. ఈ వాదనతో విభేదించిన పోలీసులు విచారణకు కుంద్రా సహకరించడం లేదన్నారు. అలాగే ల్యాప్‌టాప్‌లో డేటాను డిలీట్ చేశారని, చాలా వరకూ రికవరీ చేసినట్టు చెప్పారు. అలాగే ప్రతినెలా 4 వేల నుంచి 10 వేల పౌండ్ల ఖర్చుకు సంబంధించిన లెక్కల వివరాలు అనుమానాస్పదంగా ఉండడంతో వాటిపైనా దర్యాప్తు చేయాలన్నారు. ఇప్పటికే అకౌంటెంట్ స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేసి.. పోర్నోగ్రఫీ వివాదంతోపాటు బెట్టింగ్‌ రాకెట్‌పైనా విచారణ కొనసాగిస్తున్నారు.

అటు, రాజ్‌కుంద్రా అరెస్టైన నాలుగు రోజుల తర్వాత ఇన్‌స్టాలో శిల్పాశెట్టి పెట్టిన స్టోరీ కూడా వైరల్ అయ్యింది. తనకు సవాళ్లు కొత్త కాదని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాననే సందేశాన్ని శిల్పాశెట్టి కోట్ చేసింది. ఏం జరిగినా నా లైఫ్ నేను జీవిస్తానంటూ చెప్పింది. ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ నవలలోని పేజీని షేర్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story