Sidharth Shukla : సిద్ధార్థ్‌ శుక్లా మృతి.. తెల్లవారుజామున 3:30గంటల మధ్యలో ఏం జరిగింది?

Sidharth Shukla : సిద్ధార్థ్‌ శుక్లా మృతి.. తెల్లవారుజామున 3:30గంటల మధ్యలో ఏం జరిగింది?
బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు, బిగ్‌బాస్‌-13 విన్నర్‌ సిద్ధార్థ్‌ శుక్లా గుండెపోటుతో మృతి చెందారు.

బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు, బిగ్‌బాస్‌-13 విన్నర్‌ సిద్ధార్థ్‌ శుక్లా గుండెపోటుతో మృతి చెందారు. నిద్రలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో చనిపోయినట్లు డాకర్లు వెల్లడించారు.సిద్ధార్థ్‌ శుక్లా మరణవార్త వినగానే బాలీవుడ్ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు సిద్ధార్థ్ చనిపోయే ముందు ఏం జరుగుతుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్ధార్థ్‌కు తెల్లవారుజామున 3-3.30గంటల సమయంలో మెలకువ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కాస్త ఇబ్బంది పడ్డారు. గుండెల్లో కాస్త నొప్పిగా ఉందని తన తల్లికి చెప్పడంతో, ఆమె మంచినీళ్లు ఇస్తే తాగి పడుకున్నారు. ఆ తర్వాత మళ్లీ నిద్రలేవలేదు.

తిరిగి సిద్ధార్థ్‌ ని లేపెందుకు ఆమె తల్లి ప్రయత్నించగా సిద్దార్థ్ స్పందించలేదు. వెంటనే ఆమె తన కుమార్తెకు ఫోన్ చేసి పరిస్థితి చెప్పడంతో ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. సిద్ధార్థ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలను గుర్తించలేదని వివరించారు. కాగా సిద్ధార్థ్‌ కుటుంబం కూడా ఇప్పటివరకూ ఆయన మృతిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. కాగా గతంలో సిద్ధార్థ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

"ఇతరులు నీ గురించి ఏ మాట్లాడుకుంటున్నారు.. ఏ ఆలోచిస్తున్నారని విచారించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఆనందంగా ఉండండి. వాళ్లు అలాగే మాట్లాడుకునేందుకు ఏదొకటి ఇవ్వండి" అంటూ ఫిబ్రవరిలో ట్వీట్ చేశాడు సిద్ధార్థ్. 1980 డిసెంబర్‌12న ముంబైలో జన్మించిన శుక్లా 'హంప్టీ శర్మ కి దుల్హనియా' సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు.

Tags

Read MoreRead Less
Next Story