Jayaguru: ఇంజనీర్ ఉద్యోగం వదిలి.. ఆవు పేడ, మూత్రంతో వ్యాపారం.. నెలకు రూ.10 లక్షల ఆదాయం..

Jayaguru: ఇంజనీర్ ఉద్యోగం వదిలి.. ఆవు పేడ, మూత్రంతో వ్యాపారం.. నెలకు రూ.10 లక్షల ఆదాయం..
Jayaguru: సివిల్ ఇంజనీర్ చదివి పాడి పశువుల వ్యాపారాన్ని చేసేందుకు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. నెలకు 10 లక్షలు సంపాదిస్తున్న జయగురు సక్సెస్ స్టోరీ..

Jayaguru: సివిల్ ఇంజనీర్ చదివి పాడి పశువుల వ్యాపారాన్ని చేయాలనుకున్నాడు. చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. ఆవు మూత్రం, పేడ నెలకు 10 లక్షలు సంపాదిస్తున్న జయగురు సక్సెస్ స్టోరీ..

జయగురు అనే 26 ఏళ్ల రైతు 2019 లో ఉద్యోగం మానేసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. ఏ మాత్రం అవగాహన లేని రంగంలోకి అడుగుపెట్టాడు. అయినా తన మీద తనకు నమ్మకం.. కష్టపడి పనిచేసే త్వం. గోమాత తనకు అన్యాయం చేయదనే ఆశ. వెరసి పాడి పశువుల వ్యాపారం మొదలు పెట్టాడు. ఇప్పుడు అతడు ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు సంపాదించిన జీతం కంటే చాలా ఎక్కువ సంపాదిస్తున్నాడు.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ నివాసి అయిన జయగురు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కొన్నాళ్ళు రూ. 22,000 జీతంతో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేశాడు. 2019 లో అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన కుటుంబం చేస్తున్న వ్యాపారంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే తండ్రి చేస్తున్న పాడి పశువుల వ్యాపారంలో మెళకువలు సాధించి వ్యాపారాన్ని మరింత విస్తరింప చేయాలనుకున్నాడు.

ఆ దిశగా పరిశోధన ప్రారంభించాడు. అతని డెయిరీ ఫామ్ విజయవంతమైంది. మరోపక్క ఆవు పేడను ఆరబెట్టే యంత్రాన్ని కొనుగోలు చేశాడు. తద్వారా రైతులు ఆ పేడను సులభంగా కొనుగోలు చేయగలుగుతున్నారు. జయగురు ప్రతిరోజూ దాదాపు 1000 బస్తాల ఆవు పేడను విక్రయిస్తున్నారు.

అతను ఆవు పేడ, ఆవు మూత్రం, రైతులకు ఉపయోగపడే మిశ్రమం కలిపి ఆవు పేడ స్లర్రీని కూడా తయారు చేస్తున్నారు. అతను తన ఆవులను స్నానం చేయడానికి ఉపయోగించే నీరు కూడా వృథాగా పోనివ్వకుండా పంట పొలాలకు వినియోగించే ఏర్పాటు చేసుకున్నారు. ఈ సామర్ధ్యమే అతడిని విజయవంతమైన రైతుగా మార్చింది,

జయగురు రోజకి దాదాపు 30-40 కిలోల నెయ్యి, 750 లీటర్ల పాలను విక్రయిస్తాడు. "ఈ పనులన్నింటిలో మాకు సహాయపడటానికి మా దగ్గర దాదాపు 10 మంది సిబ్బంది ఉన్నారు. పాలు పితికే యంత్రం తో సహా అనేక యంత్రాలు మా వద్ద ఉన్నాయి. దీంతో పశువుల షెడ్‌ని శుభ్రపరచడానికి కూడా ఎక్కువ సమయాన్ని వెచ్చించే అవవసరం ఉండదు. ఇలాంటి చిన్న చిన్న మార్పులే ఉత్పాదకతను పెంచుతాయి అని ఆయన తన సక్సెస్‌ను వివరించారు.

జయగురు ప్రభుత్వ ప్రోత్సాహంతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకుంటున్నారు. మరింత మందిని ఈ రంగంలోకి తీసుకురావాలని ఆశ పడుతున్నారు. ఆవు పేడతో తయారయ్యే సేంద్రీయ ఎరువులు పంట పొలాలకు వినియోగిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story