Amazon Prime: అమేజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధరల్లో మార్పు.. నెలకు ఎంత పెరగనుందంటే..

Amazon Prime (tv5news.in)

Amazon Prime (tv5news.in)

Amazon Prime: సినిమాలను చూడడానికి ఒకప్పటి లాగా థియేటర్లకు వెళ్లాల్సిన పని లేకుండా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి.

Amazon Prime: సినిమాలను చూడడానికి ఒకప్పటి లాగా థియేటర్లకు వెళ్లాల్సిన పని లేకుండా ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈమధ్య ఒక సినిమా థియేటర్లలో విడుదలయిన అతి కొద్దికాలంలోనే ఓటీటీలో వచ్చేయడం కామన్ అయిపోయింది. అలాంటి ఒక ఫేమస్ ఓటీటీనే అమేజాన్ ప్రైమ్. ఇతర ఓటీటీలకంటే ప్రైమ్‌కే ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ కూడా ఉంటారు. తాజాగా ఈ ఫేమస్ ఓటీటీ తన సబ్‌స్క్రైబర్స్‌కు షాక్ ఇచ్చింది.

'లాస్ట్‌ ఛాన్స్‌ జాయిన్‌ ప్రైమ్‌' పేరుతో ఇటీవల అమేజాన్ ప్రైమ్ ఒక యాడ్‌ను విడుదల చేసింది. అప్పటినుండి ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు రేట్లు పెరగనున్నాయనే వార్త టెక్కీ వరల్డ్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా అది నిజమే అని వెల్లడైంది. త్వరలో సబ్‌స్క్రిప్షన్ ధర పెంచడానికి ప్రైమ్ సిద్ధమైంది. పెరగనున్న ధరల వల్ల సంవత్సరానికి రూ. 500 అమేజాన్ ప్రైమ్ కోసం అధనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

అమేజాన్ ప్రైమ్ కొత్త ధరలు

యానువల్‌ సబ్‌ స్క్రిప్షన్‌‌కు ప్రస్తుతం రూ. 999 ఉండగా అది కాస్త రూ. 1,499కు పెరగనుంది.

క్వార్టల్లీ సబ్‌ స్క్రిప్షన్‌ ధర రూ.329 ఉండగా అది రూ.359 అవ్వనుంది.

ఒక నెలకు సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జి రూ.129 ఉండగా అది రూ.179 కానుంది.

Tags

Read MoreRead Less
Next Story