Chetak e- scooter: హైదరాబాద్‌ మార్కెట్లోకి చేతక్‌ ఈ-స్కూటర్‌ ఎంట్రీ.. టెస్ట్ రైడ్ కోసం ఈ కేంద్రాలను సందర్శించండి

Chetak e- scooter: హైదరాబాద్‌ మార్కెట్లోకి చేతక్‌ ఈ-స్కూటర్‌ ఎంట్రీ.. టెస్ట్ రైడ్ కోసం ఈ కేంద్రాలను సందర్శించండి
హైదరాబాద్‌లో బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, తన చేతక్‌ ఇ-స్కూటర్‌ను విక్రయించేందుకు ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ను ప్రారంభించింది.

Chetak e- scooter: హైదరాబాద్‌లో బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, తన చేతక్‌ ఇ-స్కూటర్‌ను విక్రయించేందుకు ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ను ప్రారంభించింది. చేతక్‌.కామ్‌ అనే వెబ్‌సై‌ట్‌లో రూ.2,000 చెల్లించి www.chetak.com అనే వెబ్‌సైట్‌లో చేతక్‌ ఇ-స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని బజాజ్‌ ఆటో వెల్లడించింది. పుణే, బెంగళూరు, చెన్నైతో పాటు ఇప్పటి వరకూ ఏడు నగరాల్లో చేతక్‌ ఈ-స్కూటర్‌‌ను విడుదల చేశామని బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ తెలిపారు. ఇతర నగరాల మాదిరిగానే హైదరాబాద్‌లో కూడా స్పందన లభిస్తుందని భావిస్తున్నామన్నారు.

ఇప్పటి వరకూ ఇ-స్కూటర్‌ను మంగళూరు, బెంగళూరు, మైసూరు, ఔరంగాబాద్‌, నాగ్‌పుర్‌, చెన్నై, పుణెలలో మాత్రమే విక్రయిస్తోంది. మూడేళ్ల బ్యాటరీ వారెంటీతో నాలుగు రంగుల్లో చేతక్ ఇ-స్కూటర్‌ లభించనుంది. ఇ-స్కూటర్‌ ప్రారంభ ధర రూ.1.44 లక్షల నుంచి ఉన్నట్లు బజాజ్‌ ఆటో పేర్కొంది. స్కూటర్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1,44,175. ఇప్పటి వరకూ జరిగిన బుకింగ్‌లకు అక్టోబరు నుంచి డెలివరీలు ప్రారంభించనున్నట్లు రాకేశ్ శర్మ తెలిపారు.

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం చేతక్‌ ఇ-స్కూటర్‌ బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్‌ అవుతుంది. ఒకసారి ఛార్జింగుతో 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. బ్యాటరీకి 3 ఏళ్లు లేదా 50,000 కిలోమీటర్ల వరకూ వారెంటీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 12,000 కిలోమీటర్ల ప్రయాణం లేదా ఒక ఏడాది తర్వాత సర్వీసింగ్‌ చేయాల్సి ఉంటుంది. టెస్ట్‌ రైడ్‌ కోసం ఆసక్తి గల వినియోగదార్లు బేగంపేట, కాచిగూడ, కూకట్‌పల్లిలోని చేతక్‌ ఇ-స్కూటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలను సందర్శించవచ్చని వివరించింది

Tags

Read MoreRead Less
Next Story