Cumin Seeds: జీలకర్ర ధరలు అమాంతం..

Cumin Seeds: జీలకర్ర ధరలు అమాంతం..
Cumin Seeds: ఉత్పత్తి తగ్గడంతో జీలకర్ర ధరలు అమాంతం పెరుగుతున్నాయి.

Cumin Seeds: 2021-2022 రబీ సీజన్‌లో జీలకర్ర ధరలు 30-35 శాతం పెరిగి ఐదేళ్ల గరిష్ట స్థాయి రూ.165-170కి చేరవచ్చని క్రిసిల్ క్రిసిల్ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది

ఉత్పత్తి క్షీణత, తక్కువ విస్తీర్ణం, పంట నష్టం కారణంగా 2021-2022 పంట సీజన్‌లో జీలకర్ర ధర 30-35 శాతం వరకు పెరిగి ఐదేళ్ల గరిష్ట స్థాయి రూ.165-170కి చేరే అవకాశం ఉంది.

జీలకర్ర విస్తీర్ణం కూడా 2021-2022 రబీ సీజన్‌లో ఏడాది ప్రాతిపదికన 21 శాతం తగ్గి 9.83 లక్షల హెక్టార్లకు చేరుకుంది. జీలకర్ర ఉత్పత్తి చేసే రెండు ప్రధాన రాష్ట్రాలైన గుజరాత్‌లో విస్తీర్ణం 22 శాతం, రాజస్థాన్‌లో 20 శాతం తగ్గింది.

నివేదిక ప్రకారం, రైతులు ఆవాలు, శనగ పంటల వైపు మొగ్గు చూపడం వల్ల విస్తీర్ణం తగ్గుముఖం పట్టిందని, దీని వల్ల ధరలు పెరిగాయని తెలుస్తోంది. జీలకర్ర విత్తే కాలంలో (అక్టోబర్-డిసెంబర్ 2021), ఆవాల ధరలు ఏడాది ప్రాతిపదికన 43 శాతం పెరిగి కిలో రూ. 74కు చేరాయి. పప్పుల ధరలు 35 శాతం పెరిగాయి.

జీలకర్ర ధరలు క్షీణించడంతో రైతులు ఈ పంటను పండించడానికి మొగ్గు చూపడం లేదు. అంతేకాకుండా, ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రతికూల వాతావరణ పరిస్థితులు రైతులను నిరుత్సాహ పరిచింది. ఫలితంగా గుజరాత్‌లో 20 శాతం, రాజస్థాన్‌లో 15 శాతం దిగుబడి తగ్గిందని నివేదిక పేర్కొంది.

జీలకర్ర ఉత్పత్తి సంవత్సరానికి 35 శాతం క్షీణించి 2022 నాటికి 5,580 లక్షల టన్నులకు తగ్గుతుందని అంచనా వేయబడింది. ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగే అవకాశం ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు కూడా 24 శాతం క్షీణించాయి. చైనాకు ఎగుమతులు 51 శాతం తగ్గాయి.

Tags

Read MoreRead Less
Next Story