Custard Apple: బంజరు భూమిలో సీతాఫలం సాగు.. రూ.15 లక్షలకు పైగా..

Custard Apple: బంజరు భూమిలో సీతాఫలం సాగు.. రూ.15 లక్షలకు పైగా..
Custard Apple: ప్రస్తుతం బంజరు భూమిలో సీతాఫలం సాగు చేస్తూ ఏటా లక్షల్లో సంపాదిస్తున్నారు రైతులు.

Custard Apple: సీజనల్ ఫ్రూట్ సీతాఫలం ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఒకప్పుడు బుట్టల్లెక్కన అమ్మే వారు. ఇప్పుడు వాటిని కూడా కేజీ రూ.100, రూ.150 అంటూ అమ్మేస్తున్నారు. సైజులో, నాణ్యతలో మార్పు సంతరించుకున్న సీతాఫలం సాగుని మహారాష్ట్ర రైతులు విరివిగా చేపడుతున్నారు. పెద్దమొత్తంలో ఆదాయాన్నీ ఆర్జిస్తున్నారు.

సంప్రదాయ వ్యవసాయం కంటే మహారాష్ట్ర రైతులు హార్టికల్చర్ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలోని బీడ్, జల్గావ్, ఔరంగాబాద్, పర్భానీ, అహ్మద్‌నగర్, నాసిక్, షోలాపూర్, సతారా మరియు భండారా జిల్లాల్లో సీతాఫలం పంటను అధికంగా సాగు చేస్తారు.

సీతాఫలం సాగును రైతు ఎప్పుడు ప్రారంభించాడు?

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా చకూర్ తహసీల్ జన్వాల్ గ్రామానికి చెందిన బాలకృష్ణ నామ్ దేవ్ యేలేలే అనే రైతు చెబుతున్నారు. తనకున్న బంజరు భూమిలో ఆరు ఎకరాల్లో సీతాఫలం సాగు చేశాడు. 2013లో సాగు చేయడం ప్రారంభించానని తెలిపాడు.

2 వేలకు పైగా సీతాఫలం మొక్కలు నాటగా 2019 నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని వివరించాడు. 2020 సీజన్‌లో ఎకరానికి రూ.2.5 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు. బాలకృష్ణ రూ. 2 లక్షలతో ప్రారంభించిన సీతాఫలం సాగు ద్వారా నేడు రూ.15 లక్షలకు పైగానే ఆర్జిస్తున్నాడు. ఈ సీతాఫలాలను ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు ఇలా అన్ని రాష్ట్రాల మార్కెట్లలో విక్రయిస్తుంటారు.

సీతాఫలం MK 1 గోల్డెన్ జాతుల ప్రత్యేకత

ఈ పండ్లు అందంగా కనిపించడంతోపాటు రైతులు తక్కువ నీటిలో ఎక్కువ ఉత్పత్తి చేయగలరు, ఈ జాతి పండు ఎక్కువ కాలం ఉంటుంది. పండు బరువు 400 గ్రాముల కంటే ఎక్కువ. ఈ రోజుల్లో రైతులు సీతాఫలం సాగుపై చాలా ఆసక్తి చూపుతున్నారు.

ఉద్యాన పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

మరాఠ్వాడాలోని ధరూర్, బాలాఘాట్ గ్రామాలు సీతాఫలం పంటకు ప్రసిద్ధి. 1990-91 నుంచి ప్రారంభించిన ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఉద్యానవన అభివృద్ధి పథకం కింద ఎండు పండ్ల చెట్ల పెంపకంలో సీతాఫలంను చేర్చారు. ఈ పథకం కింద సీతాఫలం మొక్కలను 25906 హెక్టార్ల విస్తీర్ణంలో విజయవంతంగా నాటారు. కొత్తిమీర సాగులో కూడా మహారాష్ట్రకు మంచి పేరు ఉంది.

Tags

Read MoreRead Less
Next Story