Facebook Back : ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు పునరుద్ధరణ ..!

Facebook Back : ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు పునరుద్ధరణ ..!
Facebook Back : ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 గంటల పాటు నిలిచిపోయిన వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు పునరుద్ధరణ అయ్యాయి.

Facebook Back : ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 గంటల పాటు నిలిచిపోయిన వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు పునరుద్ధరణ అయ్యాయి. రాత్రి 9 గంటల 5 నిమిషాల నుంచి వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం సేవలు స్తంభించిపోయాయి. దీంతో వినియోగదారులు కొన్ని గంటల పాటు ఇబ్బంది పడ్డారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలను మళ్లీ పునరుద్ధరించారు.

సోషల్‌ మీడియా సేవలు నిలిచిపోవడంతో ఈ వార్త ఒక్కసారిగా సంచలనమైంది. వీటిపై ఆధారపడ్డ కోట్ల మంది ఎందికిలా జరిగిందో అర్థంకాక హైరానా పడ్డారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. పలువురు ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాలవైపు దృష్టి సారించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల సేవలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయని, పునరుద్ధరణ చర్యలు చేపట్టామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. అంతరాయంపై క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది. భారత్‌లో దాదాపు 41 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులున్నారు. వాట్సప్‌ను సుమారు 53 కోట్ల మంది వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రాం ఖాతాదారులు 21 కోట్ల పైనే ఉన్నారు.

వెబ్‌ సేవలను పర్యవేక్షించే డౌన్‌ డిటెక్టర్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌.. వినియోగదారుల నుంచి కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాట్సాప్‌కు సంబంధించిన 9000 క్రాష్‌ రిపోర్టులు, ఇన్‌స్టాగ్రామ్‌పై 8 వేలు, ఫేస్‌బుక్‌పై 4000 క్రాష్‌ రిపోర్టులు వచ్చాయని వెల్లడించింది. వెబ్‌సైట్‌, యాప్‌, సర్వర్‌ కనెక్షన్‌లకు సంబంధించిన సమస్యల వల్లే ఈ మూడు యాప్‌లు మొరాయించి ఉండొచ్చని డౌన్‌ డిటెక్టర్‌ వ్యాఖ్యానించింది.

ఫేస్‌బుక్‌ వెబ్‌ పేజీలను తెరిచే ప్రయత్నం చేయగా మైన్‌ నేమ్‌ సిస్టమ్‌ ఎర్రర్‌ అని చూపించిందని ఓ వార్తాసంస్థ తెలిపింది. డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ అనేది వినియోగదారులను వారు కోరిన వెబ్‌ చిరునామాకు చేర్చే సాంకేతిక వ్యవస్థ అని పేర్కొంది. బహుశా ఇది విఫలమైనందు వల్లే ఫేస్‌బుక్‌ వెబ్‌పేజీ తెరుచుకోకపోయి ఉండొచ్చని అంచనా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story