flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మొబైల్స్ పై భారీ డిస్కౌంట్..

flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మొబైల్స్ పై భారీ డిస్కౌంట్..
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మరో సేల్‌ను కస్టమర్ల ముందుకు తీసుకు వచ్చింది.

flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మరో సేల్‌ను కస్టమర్ల ముందుకు తీసుకు వచ్చింది. ఈ సేల్ జూలై 25 నుంచి జూలై 29 వరకు నడుస్తుంది. ఈ సేల్‌లో కొన్ని టాప్ బ్రాండ్ స్మార్ట్ ‌ఫోన్లపై స్పెషల్ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యుల కొరకు ఈ సేల్ ఒక రోజు ముందుగా ప్రారంభం అవుతుంది. ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఐసీఐసీఐ ఖాతాదారులు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

ప్రస్తుతం రూ.23.999 ధర గల పోకో ఎక్స్ 3 ప్లస్ సేల్ సమయంలో రూ.17,249కు లభ్యమవుతుంది. పోకో ఎక్స్ 3 ప్లస్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఇది 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డి + డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రియర్ క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ప్రస్తుతం రూ.23,999 ధరకు లభిస్తున్న షియోమీకి చెందిన ఎంఐ 11 లైట్ రూ.20,499కు లభ్యం కానుంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంద. ఇది 64 మెగా పిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. వీటితో పాటు శామ్ సంగ్, ఒప్పో, వివో, ఆపిల్ బ్రాండ్స్‌కి చెందిన మొబైల్స్ పై కూడా భారీ డిస్కౌంట్స అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story