Hero Xpulse 200 4V: హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ.. మొదటి అడ్వెంచర్ బైక్ ఫీచర్లు, ధర చూస్తే..

Hero Xpulse 200 4V:  హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ.. మొదటి అడ్వెంచర్ బైక్ ఫీచర్లు, ధర చూస్తే..
Hero Xpulse 200 4V: వాహన ప్రియుల కోసం ప్రముఖ సంస్థ హీరో మోటార్స్ మొదటి అడ్వెంచర్ బైక్‌ని మార్కెట్లోకి తీసుకువచ్చింది.

Hero Xpulse 200 4V: వాహన ప్రియుల కోసం ప్రముఖ సంస్థ హీరో మోటార్స్ మొదటి అడ్వెంచర్ బైక్‌ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. అదే హీరో ఎక్స్ పల్స్ 200 4వీ. భారత్‌లో 200 సీసీ ఇంజన్ కలిగిన మొదటి అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఇదేనని హీరో సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటికే ఎక్స్‌పల్స్ 200 మోడల్ మార్కెట్లో సందడి చేస్తుండగా.. తాజాగా ఈ సరికొత్త బైక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యువకులనే లక్ష్యంగా పెట్టుకుని ఈ మోటార్ సైకిల్‌ను భారత విపణిలోకి తీసుకొచ్చింది హీరో సంస్థ. అంతర్జాతీయ మోటో ఈవెంట్లకు వెళ్లాలనుకునేవారికి ఇది అత్యుత్తమ ఎంపిక.

ఇంజన్..

ఈ సరికొత్త హీరో ఎక్స్ పల్స్ 200 4వీ మోటార్ సైకిల్ 6 శాతం పవర్, 5 శాతం టార్క్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఇది 200 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉండి 8500 ఆర్పీఎం వద్ద 18.83 జీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 17.35 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ మాత్రమే కాకుండా ఈ బైక్‌లో చాలా అప్డేట్లు వచ్చాయి. టూరింగ్ ఆఫ్ రోడ్ అనుభూతిని పొందాలనుకునేవారికి ఈ బైగా అనువుగా ఉంటుందని కంపెనీ స్పష్టం చేస్తోంది.

ప్రత్యేకతలు..

ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, రాత్రి పూట బ్యాటరీ విజిబిలిటీ లాంటి నూతన ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై నేవిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఎకో మోడ్, టూ ట్రిప్ మీటర్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ లాంటి ప్రత్యేకతలు ఈ బైక్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా 37 ఎంఎం టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, 190 ఎంఎం ట్రావెల్, 10 స్టెప్ ట్రావెల్ అడ్జస్టబుల్ రియర్ మోనోషాక్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ధర..

ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త హీరో ఎక్స్ పల్స్ 200 4వీ బైక్ ప్రారంభ ధర వచ్చేసి రూ.1.28 లక్షలుగా సంస్థ నిర్ధేశించింది. అంతేకాకుండా నిజమైన ఔత్సాహికులకు రూ.46,000లకే ర్యాలీ కిట్‌ను అందిస్తోంది. ఈ కిట్ ద్వారా ఆఫ్ రోడ్ టైర్లకు ఫ్రంట్-బ్యాక్ మెరుగైన సస్పెన్షన్, ర్యాలీ స్టైల్ బెంచ్ సీట్, హ్యాండిల్ బార్ రైజర్లు, పొడవాటి సైడ్ స్టాండ్ లాంటి వాటికి అదనపు ఆకర్షణ ఇస్తుంది. ఇవి కాకుండా ఇందులో 276 ఎంఎం ఫ్రంట్ పెటల్ డిస్క్ బ్రేక్, 220 ఎంఎం రియర్ పెటల్ డిస్క్ బ్రేక్స్ ఇందులో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story