Government Bonds: ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు.. లాభాలు, నష్టాలు..

Government Bonds: ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు.. లాభాలు, నష్టాలు..
Government Bonds: ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడితే మన నగదుకి భద్రత ఉంటుందని భావిస్తాము.

Government Bonds: ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడితే మన నగదుకి భద్రత ఉంటుందని భావిస్తాము. చిన్న మదుపరులు కూడా మదుపు చేసే అవకాశాన్ని ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తోంది. ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ వేదిక ద్వారా వీటిల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే బ్యాంకుల్లో వచ్చే వడ్డీతో పోలిస్తే రాబడి కాస్త తక్కువగా ఉంటుంది. ప్రభుత్వమే మీ డబ్బుకు హామీ ఉంటుంది కాబట్టి వడ్డీ తక్కువ వచ్చినా అసలుకు ఢోకా ఉండదు కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు.

దీర్ఘకాల పెట్టుబడులకు ప్రభుత్వ బాండ్లు ఉపయోగకరం. గరిష్టంగా 40 ఏళ్ల వరకు వీటిల్లో మదుపు చేయవచ్చు. బాండ్లలో మదుపు చేయడం వల్ల దీర్ఘకాలం పాటు మంచి రాబడిని అందుకోవచ్చు. బాండ్లలో పొదుపు చేయడం వలన ఎలాంటి నష్టభయం లేకుండా రాబడిని సొంతం చేసుకోవచ్చు.

కొన్ని సార్లు బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లకే అధిక వడ్డీ రేటు వస్తుంది. కానీ కర్ణాటక ప్రభుత్వ బాండ్లు మాత్రం 6.83 శాతం వడ్డీని అందిస్తున్నాయి. మిగతా బ్యాంకులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ప్రభుత్వ బాండ్లకు బదులుగా ఇతర పెట్టుబడి పథకాలను పరిశీలించాలనుకున్నప్పుడు కొన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.

ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేటు బాండ్లలో పోస్టాఫీసు జాతీయ పొదుపు పత్రాలకన్నా 0.35 శాతం అధిక రాబడి వస్తుంది. ఇది ప్రతి ఆరు నెలలకోసారి మారుతుంది. అయితే వీటిని రుణాల కోసం హామీగా పెట్టలేం. వీటిలో ఏడేళ్లవరకు కొనసాగాలి.

వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గుల నుంచి పెట్టుబడిని కాపాడుకునేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను పరిశీలించవచ్చు. సీనియర్ సిటిజన్లు ప్రధానమంత్రి వయ వందన యోజన, సీనియర్ సిటిజన్ సేవిగ్ స్కీంలాంటివి ఎంచుకోవచ్చు. అయితే బాండ్లలో మదుపు చేసేటప్పుడు కొన్ని అనుకూలతలు ఉన్నట్లే మరికొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి.

ఒకసారి బాండ్లలో మదుపు చేసిన తర్వాత అందులో నుంచి పెట్టుబడి వెనక్కి తీసుకోవడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. బాండ్లను హామీగా ఉంచి, రుణం తీసుకునే వెసులుబాటు ఉంది కానీ అది ఇంకా అమలులోకి రాలేదు.

Tags

Read MoreRead Less
Next Story