Jio: ఎయిర్‌టెల్, వొడాఫోన్ బాటలో జియో.. రిచార్జ్ ప్యాక్స్‌పై..

Jio: ఎయిర్‌టెల్, వొడాఫోన్ బాటలో జియో.. రిచార్జ్ ప్యాక్స్‌పై..
Jio: మధ్య తరగతి వారిపై ఇప్పటికే ఎన్నో ధరలు భారంలాగా తయారయ్యాయి.

Jio: మధ్య తరగతి వారిపై ఇప్పటికే ఎన్నో ధరలు భారంలాగా తయారయ్యాయి. పైగా ప్రతీ నిత్యవసర వస్తువు ధర రోజురోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఇప్పుడు మొబైల్ రిచార్జ్ ధరలు కూడా పెంచేస్తున్నట్టు ఒకటి తర్వాత ఒకటి నెట్‌వర్క్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ముందుగా ఎయిర్‌టెల్ తమ ధరలను పెంచుతున్నట్టుగా ప్రకటించింది. ఆ వెంటనే మిగిలిన నెట్‌వర్క్‌లు కూడా ధరలను పెంచేశాయి.

ఒకప్పుడు 10 రూపాయల రిచార్జ్‌తో ఫోన్‌ల హవా మొదలయింది. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక అందులో డేటా అనేది ముఖ్యంగా మారిపోయింది. నెలకు 1 జీబీ డేటా నుండి రోజుకి 1 జీబీ డేటా వరకు అభివృద్ధి సాధించాం. ప్రస్తుతం స్మా్ర్ట్ ఫోన్‌ను మెయింటేయన్ చేయని వారు లేరు.. అందులో డేటా బ్యాలెన్స్ వేసుకోని వారు లేరు. అందుకే పెరిగిన ఈ రిచార్జ్ ప్యాక్స్ అందరిపై అధిక భారాన్నే మోపుతున్నాయి.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ తర్వాత ఇప్పుడు జియో కూడా ధరలను పెంచేస్తున్నట్టు ప్రకటన చేసింది. 20 శాతం వరకు ప్రీ పెయిడ్ ఛార్జీలు పెంచుతున్నట్టు తెలిపింది. డిసెంబర్ 1 నుండే పెరిగిన రిచార్జ్ ధరలు అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. వీరు పెంచుతున్న రిచార్జ్ ధరల వల్ల టెలికాం సంస్థ బలోపేతం అవుతుందని సంస్థలు అంటున్నా యూజర్లు మాత్రం వీటిపై విచారణ వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన జియో రిచార్జ్ ధరలు ఇలా ఉన్నాయి..



Tags

Read MoreRead Less
Next Story