LIC IPO : ఎల్‌ఐసీ ఐపీఓ రేపటి నుంచి ప్రారంభం..!

LIC IPO : ఎల్‌ఐసీ ఐపీఓ రేపటి నుంచి ప్రారంభం..!
LIC IPO :స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న ఎల్‌ఐసీ ఐపీఓ రేపటి నుంచి ప్రారంభం అవుతోంది.

LIC IPO :స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్న ఎల్‌ఐసీ ఐపీఓ రేపటి నుంచి ప్రారంభం అవుతోంది. మే 9వ తేదీ వరకు రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఎల్‌ఐసీ పాలసీదారులు రేపటి నుంచి IPOకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఐసీ ప్రైస్‌బ్రాండ్‌ను 902 రూపాయల నుంచి 949 రూపాయలుగా నిర్ణయించింది.

ఇప్పటికే గ్రే మార్కెట్‌లో భారీ ప్రీమియంతో ట్రేడవుతోంది ఎల్‌ఐసీ. యాంకర్‌ ఇన్వెస్టర్లు సైతం ఎల్‌ఐసీ ఐపీవోకు ఎగబడ్డారు. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు ఎల్‌ఐసీపై ఆసక్తి చూపుతున్నారు. 949 రూపాయల వద్ద 5వేల 620 కోట్ల రూపాయల విలువైన షేర్లకు పెద్ద ఇన్వెస్టర్లు దరఖాస్తు చేశారు. నార్వే బ్యాంక్‌, సింగపూర్‌ వెల్త్‌ఫండ్‌ సైతం ఎల్‌ఐసీ ఐపీఓకు దరఖాస్తు చేసుకున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్స్‌ సైతం ఎల్‌ఐసీ షేర్లపై ఇంట్రస్ట్ చూపించాయి. ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా అమ్మకం ద్వారా 21వేల కోట్లు సమీకరిస్తోంది ప్రభుత్వం. పబ్లిక్‌ ఆఫర్‌లో భాగంగా ఎల్‌ఐసీ 22.13 కోట్ల షేర్లను జారీ చేస్తోంది. ఇందులో 9.88 కోట్ల షేర్లు క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు, 2.6 కోట్ల షేర్లు నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు, 15 లక్షల 81 వేల షేర్లు ఉద్యోగులకు, 2 లక్షల 21వేల షేర్లు పాలసీదారులకు కేటాయించారు.

పాలసీదారులకు షేరు ధరలో 60 రూపాయలు, రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు 45 రూపాయల చొప్పున రాయితీ ఇస్తోంది. ఈ నెల 17న ఎల్‌ఐసీ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ కానుంది.

Tags

Read MoreRead Less
Next Story