No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐలో కూడా వడ్డీ ఉంటుంది.. ఎలాగంటే..

No cost EMI (tv5news.in)

No cost EMI (tv5news.in)

No Cost EMI: తెలుగువారి పండగలకు ముఖ్యమైన విషయం షాపింగ్. పండగలో షాపింగ్ హడావిడి కూడా ఒక భాగమే.

No Cost EMI: తెలుగువారి పండగలకు ముఖ్యమైన విషయం షాపింగ్. పండగలో షాపింగ్ హడావిడి కూడా ఒక భాగమే. అందుకే షాపింగ్ మాల్స్, క్లాతింగ్ బ్రాండ్స్ అన్నీ డిస్కౌంట్స్‌తో ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటాయి. షాపింగ్ అంటే బట్టలు మాత్రమే కాదు.. వస్తువులు కూడా. పండగకు ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవాలి అన్న సెంటిమెంట్ ఇప్పటికీ చాలామందికి ఉంది. అందుకే ప్రముఖ బ్రాండ్స్ అన్నీ నో కాస్ట్ ఈఎంఐను ప్రవేశపెట్టాయి. అసలు నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏంటి..

ఈమధ్య క్యాష్ ప్లేస్‌లో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వచ్చేశాయి. ఏది కొనాలన్నా ఈ కార్డ్స్‌ను ఉపయోగించడం దాదాపు చాలామందికి అలవాటు అయ్యింది. కానీ ఖరీదైన వస్తువు కొనాలనుకున్నప్పుడు క్రెడిట్ కార్డ్‌తో కొనాలనుకున్నా తరువాత ఒకేసారి అంత డబ్బు కట్టగలుగుతామా అన్న అనుమానం ఉండొచ్చు. అందుకే ఈఎంఐ పద్ధతి ట్రెండ్‌లోకి వచ్చేసింది. దీనికి తొడుగా నో కాస్ట్ ఈఎంఐ ఈ మధ్య అందరికీ ఉపయోగపడుతోంది.

నో కాస్ట్ ఈఎంఐ అనేది ఒక బంపర్ ఆఫర్ లాంటిది. మామూలుగా ఈఎంఐ అంటే ఒక వస్తువును కొనుగోలు చేసిన తర్వాత వాయిదాల పద్ధతిలో దాని మొత్తం డబ్బును కట్టేయడం. అది అందరికీ తెలుసు. అలా చేసినప్పుడు ఆ ఎమౌంట్‌కు వడ్డీ కూడా కలుస్తుంది. అంటే ఒరిజినల్ రేట్ కంటే ఈఎంఐలో కొన్నప్పుడు కాస్త ఎక్కువ డబ్బు కట్టాల్సి వస్తుందన్నమాట. నో కాస్ట్ ఈఎంఐ వల్ల ఈఎంఐలో వడ్డీ భారం తగ్గుతుంది.

ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్రకారం ఏ సంస్థ కూడా సున్నా వ‌డ్డీతో రుణాలు ఇవ్వకూడదు. కానీ నో కాస్ట్ ఈఎంఐకి వడ్డీ ఉండదు అని మాట్లాడుకుంటున్నాం కదా అనే సందేహం రావచ్చు. అయితే.. సంస్థ ఆ వడ్డీని వసూలు చేయకుండా ఉండదు. ఎలా చేస్తుందంటే..

నిజానికి ఈ-కామర్స్‌ సంస్థ చెల్లించే వడ్డీ మొత్తం కంటే మీ దగ్గర బ్యాంకులు వడ్డీ రూపంలో వసూలు చేసే మొత్తం కొంత అధికంగా ఉండొచ్చు. వడ్డీ రూపంలో ఎంత వసూలు చేస్తారనేది ఈ-కామర్స్‌ సంస్థలు ఆ సందర్భంలో చెప్పవు. అలా నో కాస్ట్ ఈఎంఐ వడ్డీ అక్కడ సర్దుబాటు అయిపోతుంది.

కార్డు పేమెంట్‌ అప్పుడు ఇచ్చే ముందస్తు 'నో-కాస్ట్‌ ఈఎంఐ డిస్కౌంట్‌'... తిరిగి చెల్లించేటప్పుడు వేసే పూర్తి వడ్డీ అనేవి మొదటి విధానం ప్రకారమే ఉంటాయి. అయితే, ఈ తరహా నో-కాస్ట్‌ ఈఎంఐలను కొన్ని సందర్భాల్లోనే ఇ-కామర్స్‌ సంస్థలు వినియోగిస్తుంటాయి. ఈ రెండు విధానాల్లో ఈఎంఐలకు జీఎస్‌టీ అదనంగా ఉంటుంది.

అంటే నో కాస్ట్ ఈఎంఐ అంటే పూర్తిగా వడ్డీ ఉండదు అనుకోకూడదు. ఆ వడ్డీని పన్ను రూపంలో కూడా మన దగ్గర నుండి తీసుకుంటాయి కొనుగోలు సంస్థలు. నో కాస్ట్ ఈఎంఐ వల్ల వచ్చే లాభం ఏంటంటే.. రుణం కోసం ప్రత్యేకంగా ద‌ర‌ఖాస్తు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా వెంటనే పథకాన్ని ఎంచుకుని ఒకేసారి వస్తువును కొనుక్కోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story