Business: ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు.. ఇకపై ప్రతీ ఒకటో తారీఖు..

LPG gas (tv5news.in)

LPG gas (tv5news.in)

Business: ఇప్పటికే ఈ సంవత్సరం మొదలయినప్పటి నుండి దేశ వాణిజ్య రంగంలో చాలా మార్పులు వచ్చాయి.

Business: ఇప్పటికే ఈ సంవత్సరం మొదలయినప్పటి నుండి దేశ వాణిజ్య రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిపై ఇంతకు ముందుకంటే ఇప్పుడు మరింత భారం ఎక్కువయ్యింది. రానున్న నవంబర్ 1 నుంచి ఈ భారం మరింత పెరగనుందా..? పలు కీలక విషయాల్లో ప్రభుత్వం కొత్త మార్పులు చేపట్టనుందా..? నిజమే.. ఈ నవంబర్ 1 నుండి ఇండియా జరగనున్న మార్పులు ఇవే..

ఇప్పుడు ప్రతీ రంగంలో ఓటీపీ పద్ధతి వచ్చేసింది. ముఖ్యంగా ఆన్‌లైన్ వ్యవహారాల్లో ఓటీపీ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల డెలివరీలు కూడా ఓటీపీపైనే ఆధారపడి ఉంటాయట. డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ)లో భాగంగా ఎల్‌పీజీ సిలిండర్ల డెలివరీ సిస్టమ్‌లో ఈ మార్పు రానుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్‌బీ, యాక్సిస్ , సెంట్రల్ లాంటి పలు బ్యాంకులు డిపాజిట్లు, విత్‌డ్రా ఛార్జీలను పెంచనున్నాయి. అన్ని రకాల ఖాతాదారులకు మారే ఛార్జీలు వర్తించనున్నాయి. దేశవ్యాప్తంగా పలు రైల్వే టైమింగ్స్ మారనున్నాయి. 13 వేల ప్యాసింజర్ రైళ్లు , 7 వేల గూడ్స్ రైళ్లు టైమింగ్స్‌లో మార్పు రానున్నాయని భారతీయ రైల్వేస్ తెలిపింది.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మారనున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధరలు మిడిల్ క్లాస్ వారి జీవితాల్లో కుంపటిలాగా తయారయ్యాయి. ఇక గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్‌ ధరల పెంపును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ మాత్రమే కాదు ఇప్పటినుండి ప్రతీ ఒకటో తారీఖు ఎల్‌పీజీ గ్యాస్ ధరల్లో మార్పులు రానున్నట్టుగా తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story